ఏ మంత్రం వేసావె : రివ్యూ
రోజు మొత్తం వీడియో గేమ్స్, చాటింగ్ అంటూ కంప్యూటర్ ముందే గడిపే నిఖిల్ అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడు. అయితే మరోపక్క గేమ్ డిజైనర్ అయిన రాగమాలిక (శివాని సింగ్) హింసతో కూడిన ఆటలను కాకుండా కొత్తగా ప్రయత్నించాలని చూస్తుంది. స్నేహితుల చాటింగ్ ద్వారా రాగమాలిక నిఖిల్ కు పరిచయం అవుతుంది. అయితే వారిద్దరు కలుసుకోవడం మాత్రం ఓ గేమ్ లా సాగుతుంది. ఆమెను కలవాలనుకునే నిఖిల్ కు కొన్ని క్లూస్ ఇస్తుంది రాగమాలిక. ఇక ఆమెను వెతికేందుకు వెళ్లిన నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? నిఖిల్, రాగమాలిక ఎక్కడ కలిశారు..? అన్నది సినిమా కథ.
ప్రస్తుతం హీరోగా సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ తన కెరియర్ స్టార్టింగ్ డేస్ లో ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అందుకే ప్రస్తుతం ఉన్న విజయ్ దేవరకొండలా కాకుండా కాస్త సన్నగా కనిపిస్తాడు. ఇక తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునేంత గొప్ప పాత్ర ఏం కాదని చెప్పొచ్చు. ఇక శివాని సొంగ్ కూడా సోసోగానే చేసింది. మిగతా పాత్రలన్ని కూడా ఏదో చేశామంటే చేశామన్నట్టు ఉన్నారు.
సినిమాటోగ్రఫీ సినిమాకు కాస్త బెటర్ అనిపిస్తుంది. డైరక్టర్ శ్రీధర్ మర్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తగినట్టుగా కథ రాసుకున్నా దాన్ని తెర రూపం దాల్చడంలో విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగానే కానిచ్చారు. మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. ఎడిటింగ్ కూడా అంతగా ఏం లేదు.