శంభో శంకర : రివ్యూ

kumar siva
శంకర్ డ్యాన్స్, ఫైట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్శంకర్ డ్యాన్స్, ఫైట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్రొటీన్ కథ, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

అంకాళ్లమ్మపల్లెలో నివసించే శంకర్ (షకలక శంకర్) ఆ ఊరు ప్రెసిడెంట్ (అజయ్ ఘోష్) చేసే అన్యాయాలని సహిస్తూ వస్తాడు. చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఉన్న ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తుంటాడు ప్రెసిడెంట్. అతని ఆగడాలను గమనిస్తూ వచ్చిన శంకర్ అతన్ని ఢీ కొడతాడు. ఈ క్రమంలో అతనికి రావాల్సిన పోలీస్ ఉద్యోగం కూడా రాకుండా చేస్తాడు ప్రెసిడెంట్. శంకర్ చెల్లి కూడా ప్రెసిడెంట్ కొడుకు వల్లే చనిపోతుంది. చెల్లి చావుకి కారణమైన ప్రెసిడెంట్ కొడుకుని.. ప్రెసిడెంట్ మీద శంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకునాడు అన్నదే శంభో శంకర సినిమా కథ.  

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు వేస్తూ పాపులారిటీ సంపాదించిన షకలక శంకర్ సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ వచ్చాడు. కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అతను హీరోగా చేసిన మొదటి ప్రయత్నం శంభో శంకర. సినిమాలో షకలక శంకర్ ఎక్కడ కనబడడు. తన మార్క్ కామెడీ పండించడంలో విఫలమయ్యాడు. ఎమోషన్, సీరియస్, ఫైట్స్ ఇవన్ని కనిపిస్తాయి. వీటి కోసం శంకర్ బాగానే కష్టపడ్డాడని చెప్పొచ్చు. శంకర్ తర్వాత అజయ్ ఘోష్ విలన్ గా నటించాడు. కారుణ్య హీరోయిన్ గా పర్వాలేదు. మిగతా వారంతా కొత్త వాళ్లే అవడం విశేషం. 

సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తిక్ మాస్ బీట్ అలరించాయి. దర్శకుడు శ్రీధర్ కథ, కథనాల్లో కొత్తదనం చూపించలేకపోయారు. సినిమా చూస్తున్నంత సేపు రొటీన్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా లిమిటెడ్ బడ్జెట్ లో కథ ముగించినట్టు తెలుస్తుంది. 

కమెడియన్ హీరోగా మారే క్రమంలో వారిని ఏవిధంగా ప్రేక్షకుల మెప్పు పొందారో ఆ అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. కాని శంభో శంకరలో సీన్ రివర్స్ అయ్యింది. షకల శంకర్ తనలోని కొత్త యాంగిల్ ఆడియెన్స్ కు చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాడనిపిస్తుంది.

తానో హీరో మెటీరియల్ అనేలా తనకు తానుగా టాలెంట్ చూపించాడు. అయితే శంకర్ హీరో అయినా అతను నుండి ఆడియెన్స్ మెచ్చే కామెడీ కూడా ఆశించారు. అయితే అలాంటి వారికి ఈ సినిమా ఏమాత్రం రుచించదు. సినిమాలో డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ అబ్బో శంకర్ మొత్తం తన టాలెంట్ మొత్త బయటపెట్టాడు.

పోని ఎంచుకున్న కథ నిజంగా కొత్తగా ఉందా అంటే అది ఏం లేదు. రొటీన్ కథే.. దానికి తగినట్టుగానే రొటీన్ కథనం.. సాదాసీదా డైలాగ్స్ ఏవి ప్రేక్షకులను మెప్పించలేదు. ఓ మోస్తారు హీరో చేస్తే ఏమన్నా ఇంపాక్ట్ ఉండేదేమో కాని కమెడియన్ టర్నెడ్ హీరో మొదటి ప్రయత్నమే శంకర్ ఈ సినిమా చేయడం ఏమాత్రం మెప్పించలేదు. అయితే షకలక శంకర్ కష్టం మాత్రం తెర మీద కనిపిస్తుంది. 


Shakalaka Shankar,Karunya,Sreedhar.N,Y.Ramana Reddy,Suresh Kondeti,Sai Kartheekషకలక శంకర్.. ఆకట్టుకోలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: