కిస్ : రివ్యూ

Star cast: Adivi Sesh, Priya Banerjee
Producer: Saikiran Adivi, Director: Adivi Sesh

Kiss - English Full Review


కిస్ రివ్యూ: చిత్రకథ
 
హాలీవుడ్ లో హీరో అయిపోదామని అమెరికా వెళ్తాడు చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే సన్నీ(అడవి శేష్) , అక్కడ తన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరుగు ప్రయాణం పడతాడు. అలా తిరిగి వెళ్లి పోతుండగా, పెళ్లి నచ్చక ఆత్మ హత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రియను ఆపుతాడు. జీవితం ఎంత అందమయ్యిందో తెలియాలంటే తనతో ఒక్కరోజు గడమపమని చెప్పి ఒప్పిస్తాడు అలా మొదలయిన వారి ప్రయాణంలో భరత్ రెడ్డి ( రవి) ఆటంకాలు కలిగిస్తుంటాడు. ప్రియ తండ్రి ప్రియను బారత్ రెడ్డి కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకోగా ప్రియ తప్పించుకొని వచ్చి ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తుంది. ప్రియను ఎలాగయినా దక్కిన్చుకోవలనుకున్న భరత్ రెడ్డి సన్నీతో పందెం కాసి ఓడిపోతాడు. అయినా తన ఆశ తీరక ప్రియను బ్లాకు మెయిల్ చెయ్యడం మొదలు పెడతారు. దీనికి సన్నీ అడ్డుపడి ప్రియను తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తాడు. ఈ ప్రయాణంలో ప్రియ సన్నీ మీద మనసుపడినా చెప్పకుండా ఉండిపోతుంది. చివరికి ప్రియ సన్నీ లు ఒకటయ్యారా లేదా ? ప్రియ ఆత్మ హత్య చేసుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకుందా లేదా ?ప్రియ తల్లిదండ్రులు వీరి పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా అన్నది మిగిలిన కథ.

కిస్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
మాస్ గా కనిపించే ఈ పాత్రలో అడవి శేష్ బాగా చేశారు, డైలాగ్స్ చెప్పే విధానం కూడా చాలా బాగుంది కాని ఎమోషనల్ సన్నివేశాల విషయంలో మాత్రం తేలిపోయాడు... ఏడుస్తున్నాడు కాని కన్నీళ్లుండవు అన్నట్టు ఉంది అటువంటి సన్నివేశాలలో ప్రదర్శన. ప్రియ బెనర్జీ అందంగా కనిపించడమే కాకుండా పరవలేధనిపించేలా నటించింది కూడా. భరత్ రెడ్డి క్యారెక్టర్ లో రవి బాగా నటించాడు కొన్ని సన్నివేశాలలో షఫీ పరవలేధనిపించినా అయన పాత్ర చిన్నది కావడంతో అంతకన్నా ఎం చెయ్యలేకపోయాడు.

కిస్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

అడవి శేష్ మల్టీ టాలెంటెడ్, ఈ విషయం అందరికి తెలిసిందే కాని అన్నింటికీ ఒకే చిత్రంలో నిరూపించేసుకోవాలన్న తపన ఇటు దర్శకత్వం మీద అటు నటన మీద పడింది. మాస్ పాత్రలో బాగానే నటించినా దర్శకత్వం జస్ట్ ఓకే అనిపించుకున్నారు. చాలా లెంగ్తీ సీన్స్ ఉన్న ఈ చిత్రంలో ఎడిటర్ కత్తిరి నుండి తప్పించుకున్న చాలా సన్నివేశాలు కనబడతాయి. చిత్రంలో మేజర్ అసెట్ అని చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ శాన్ ఫ్రాన్సిస్కో అందాలను చాలా బాగా చూపించారు. సంగీతం వినడానికి కొత్తగా ఉన్నట్టుగానే చూడటానికి కూడా కొత్తగానే ఉన్నాయి.


కిస్ రివ్యూ: హైలెట్స్
  • అడవి శేష్ నటన
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్

కిస్ రివ్యూ: డ్రా బాక్స్
  • అడవి శేష్ దర్శకత్వం
  • డ్రాగింగ్ స్క్రీన్ప్లే
  • పాత్రల మధ్య బంధాన్ని సరిగ్గా చూపెట్టకపోవడం

కిస్ రివ్యూ: విశ్లేషణ
గతంలో కర్మ అనే చిత్రంతో మన ముందుకి వచ్చిన అడవి శేష్ పంజాతో మంచి మార్కులు కొట్టేసి మళ్ళీ హీరోగా నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నం ఇది.ఇప్పటికయినా అడవి శేష్ దర్శకత్వమా?హీరోనా? ఏదో ఒక వైపు వెళ్లి అక్కడ నిరూపించుకున్నాక మరోటి ఎంచుకుంటే బాగుంటుంది. గతంలో కూడా కర్మ మంచి కాన్సెప్ట్ అయినా దర్శకత్వం మరియు నటన రెండింటిని బాలన్స్ చెయ్యలేకపోవడం ఇట్టే కనపడిపోతుంది. అదే తప్పు మళ్ళీ చేసాడు. ఇందులో కూడా ఇటు దర్శకుడిగా అటు నటుడిగా వంద శాతం న్యాయం చెయ్యలేకపోయాడు. సినిమా అంటే రెండున్నర గంటలు ఉండాలన్న నియమం ఎం లేదు కాని ఇలానే ఉంటుందేమో అనుకున్నారో లేదా ఇలానే ఉండాలని అనుకున్నారో కాని అనవసరమయిన సన్నివేశాలను జొప్పించి మరీ రెండున్నర గంటలు పూర్తి చేశారు. మాములుగా నటిస్తేనే భరించడం కష్టంగా ఉంది మళ్ళీ మహేష్ బాబుని ఇమిటేట్ చెయ్యడం ఏంటో గాని ఆ సన్నివేశాల వరకు చిరాకు తెప్పించాయి. హీరో మాస్ గా ఉంటె సరిపోదు శేషు గారు సన్నివేశాలు కూడా అలానే ఉండాలి అప్పుడే మాస్ హీరో అన్న పేరు వస్తుంది ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు, చుట్టూ అన్ని క్లాసు గ పెట్టేసి మీరు మాత్రం మాస్ గా నటించేస్తే చాలా విచిత్రంగా అనిపించింది. కాని మాస్ హీరోగా నిరూపించుకోవాలన్న మీ తాపత్రయం బాగా కనిపిస్తుంది నిజానికి మీరు 70% సఫలం అయ్యారు కూడా సెంటిమెంట్ సన్నివేశాల్లో నటించడం ప్రాక్టీసు చేస్తే మన ఇండస్ట్రీ కి మరో మాస్ హీరో దొరికేసినట్టే. నిజానికి ఈ చిత్రానికి మరొకరు దర్శకత్వం వహించి ఉంటె ఫలితం మరోలా ఉండేది. మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది బి మరియు సి లలో కష్టమే.


కిస్ రివ్యూ: చివరగా
కిస్ - మిస్ ఇట్
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008

More Articles on Kiss | Kiss Wallpapers | Kiss Videos

" height='150' width='250' width="560" height="315" src="//www.youtube.com/embed/A38zQGc9P6E" data-framedata-border="0">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: