వెల్ కమ్ ఒబామ : రివ్యూ

Star cast: Sanjeev, Rachel
Producer: S.Bharati Krishna, Director: Sangeetham Srinivas Rao

Welcome Obama - English Full Review

వెల్ కమ్ ఒబామ రివ్యూ: చిత్రకథ 
లూసీ (రేచల్) తన బిడ్డ కోసం ఒక అద్దె గర్భవతి కోసం వెతుకుతుంటుంది ఓకే ఏజెంట్ ద్వార లూసి కి యశోద(ఊర్మిళ కనిత్కర్) పరిచయం అవుతుంది. తన కూతురిని కాపాడుకోవడానికి యశోద ఈ పనికి ఒప్పుకుంటుంది. లూసి యశోద పక్కనే ఉంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ఈ మధ్యలో యశోద అనారోగ్య పాలవగా తనకి పుట్టే బిడ్డ కూడా అనారోగ్యంతో పుడుతుందేమో అని లూసి యశోదను అబార్షన్ చేయించుకోమని కోరుతుంది యశోద అందుకు నిరాకరించగా లూసి తిరిగి అమెరికా వెళ్ళిపోతుంది. యశోదకు ఆరోగ్యవంతమయిన కొడుకు పుట్టడంతో తన ఆలనా పాలనా యశోద చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో లూసి తిరిగి యశోద వద్దకు వచ్చి తన కొడుకుని అడగటంతో సమస్య మొదలవుతుంది బయోలాజికాల్ గా లూసి తల్లి కాని యశోదది పెంచిన ప్రేమ వీరి మధ్య నెలకొన్న సంఘటనలే మిగిలిన కథ.

వెల్ కమ్ ఒబామ రివ్యూ: నటీనటుల ప్రతిభ
పోటుగాడు చిత్రం వచ్చి వారమయిన కాలేదు మళ్ళీ మన ముందుకి వచ్చిన రేచల్ ఆ చిత్రం లో కన్నా ఎక్కువగా హింసించింది.. తన స్థాయిని మించి నటించాలని ్రయత్నించి అవసరానికి మించి నటించేసింది. సింపుల్ గా చెప్పాలంటే సగటు ప్రేక్షకుడిని చిరాకుపడేలా చేసింది. ఊర్మిళ కనిత్కర్ నటన మాత్రమే ఈ చిత్రంలో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ . అనంత శ్రీ రామ్ మరియు భువన చంద్ర ప్రేక్షకుల శ్రేయస్సు మేరకు కలానికే పరిమితం అయితే మంచిది.

వెల్ కమ్ ఒబామ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సింగీతం గారి మీద ఉన్న అభిమానంతో ఈ విభాగం గురించి నేను చెప్పగలిగే ఒకే ఒక్క మాట "దర్శకత్వం బాగాలేదు" . సంగీతం కూడా మరొకరికి ఇచ్చి ఉండాల్సింది... కావలసినంత భావాన్ని పలికించలేదు.. రోహిణి అందించిన డైలాగ్స్ బాగానే ఉన్నా మిగిలిన అంశాల ప్రభావం ఆ విభాగం మీద బాగా కనపడింది. సినిమాటోగ్రఫీ బాగాలేదు. ఎడిటర్ "చాలా" జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటె ప్రేక్షకుడికి కాస్తయిన విశ్రాంతి లభించేది.


వెల్ కమ్ ఒబామ రివ్యూ: హైలెట్స్
  • ఊర్మిళ కనిత్కర్ నటన
  • సున్నితమయిన కాన్సెప్ట్

వెల్ కమ్ ఒబామ రివ్యూ: డ్రా బాక్స్
  • దాదాపుగా అన్ని అంశాలు ఈ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేవే.

వెల్ కమ్ ఒబామ రివ్యూ: విశ్లేషణ
ముందుగానే అన్నట్టుగా సింగీతం గారి మీద ఉన్న గౌరవంతో సరిగ్గా రాయలేకపోతున్నా కాని మాట్లాడుకోవడం మొదలుపెడితే ముగింపు అనేది ఉండదు అంత దారుణంగా ఉంది చిత్రం. భువన చంద్ర మరియు అనంత శ్రీ రామ్ లు కామెడీ అనే పేరుతో చేసిన సన్నివేశాలు ప్రేక్షకుడిలోని అసహనానికి కూడా అసహనం రప్పిస్తుంది. వీరి పాటలు ఎంత అందంగా ఉంటాయో నటన అంత దారుణంగా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే అత్యంత దారుణం. నిజానికి ఇది ఒక మరాఠి చిత్ర రీమేక్ ఈ విషయాన్నీ ముందే తెలియజేసుంటే ప్రేక్షకుడు కాస్త సిద్ధమయ్యి వెళ్ళేవాడు కాని ఇదేదో సింగీతం గారు కొత్తగా తెరకెక్కించిన చిత్రం అన్న బ్రమలో వెళ్ళిన ప్రేక్షకుడికి నరకం చూపించారు. కథనం అయితే కదలదాయే ఇరవైలోవెళ్తున్న బండికి స్పీడ్ బ్రేకర్ లు అడ్డం వచ్చినట్టు మధ్య మధ్యలో చిర్రెత్తించే పాటలు,సింగీతం గారు ఈ వయసులో సినిమా తీయడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే కానీ ...!! ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సింపుల్ గ చెప్పాలంటే చిత్రంలో చూడటానికి ఎం లేదు.. సింగీతం గారి ఫాన్స్ అయితే వెళ్ళకండి... కాకపోతే అసలు వెళ్ళకండి.

చివరగా
వెల్ కం ఒబామా - వెళ్తే మీ కర్మ
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008

More Articles on Welcome Obama | Welcome Obama Wallpapers | Welcome Obama Videos

" height='150' width='250' width="560" height="315" src="//www.youtube.com/embed/JCwVP6oZWl0" data-framedata-border="0">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: