చండీ : రివ్యూ

Star cast: Priyamani, Krishnam Raju
Producer: Sreenu Babu G, Director: V.Samudra

Chandee - English Full Review

   

చండీ రివ్యూ: చిత్రకథ 
అల్లూరి సీతారామరాజు వంశంలో నాలుగో తరం అయిన చండీ (ప్రియమణి) హైదరాబాద్ లో చంద్ర శేకర్ ఆజాద్ (శరత్ కుమార్) సహాయంతో కొన్ని హత్యలు చేస్తుంది ఆమెను పట్టుకోడానికి వచ్చిన సి బి ఐ ఆఫీసర్ శ్రీమన్నారాయణ (నాగబాబు). ఒక వైపు నాగ బాబు ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఉంటె చండీ మాత్రం సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తులను హత్యలు చేస్తూ ఉంటుంది ఇదే క్రమంలో చండీ మినిస్టర్( ఆశిష్ విద్యార్ధి ) తమ్ముడు బంగార్రాజు (సుప్రీత్) ని చంపేస్తుంది. అప్పటినుండి మినిస్టర్ చండీని చంపే ప్రయత్నాలలో ఉంటాడు. అసలు చండి ఎవరు ? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది ? రెబెల్ కి చండి కి ఉన్న సంభంధం ఏంటి? రెబెల్ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్ర కథ..

చండీ రివ్యూ: నటీనటుల ప్రతిభ
చండి పాత్రలో ప్రియమణి అందంగాను కనిపించి అభినయ పరంగాను ఆకట్టుకుంది. కాని అసలు సంభంధం లేని సన్నివేశాలు కావడంతో ఆమె నటన కూడా కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. రెబెల్ పాత్రలో కృష్ణం రాజు ఆకట్టుకోలేకపోయారు. పవర్ఫుల్ పాత్రలో పవర్ఫుల్ గా నటించడానికి ప్రయత్నించారు కాని ఆ స్థాయిలో పవర్ ప్రొడ్యూస్ చెయ్యలేకపోయారు శరత్ కుమార్ ఆయనకి ఇచ్చిన పాత్రలో బాగానే పాత్రను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. సి బి ఐ ఆఫిసేర్ గా వచ్చిన నాగబాబు "మెరుపు తీగ" అన్న కాన్సెప్ట్ కి సరిగ్గా సరిపోతారు. గబ్బర్ సింగ్ పాత్రలో నటించిన పోసాని అసలు ఆకట్టుకోలేకపోయారు. మిగిలిన నటులందరు ప్యాడింగ్ కోసమే కాని యాక్టింగ్ కోసం కాదన్నట్టు నటించారు వారి పాత్రలను రచించిన విధానం కూడా అలానే ఉంది కాబట్టి ఈ విభాగంలో ఇంతకన్నా ఎక్కువగా ఎం చెప్పుకోలేము.

చండీ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సముద్ర గురించి ముందుగా చెప్పుకుంటే అయన గత చిత్రాలతో ఏ మాత్రం తీసిపోకుండా ప్రతి సన్నివేశాన్ని ఇదే ఈ చిత్రానికి హైలెట్ అన్నంత రీతిలో తీర్చి దిద్దలన్న ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో ఏ సన్నివేశము హైలెట్ కాకపోగా ఒకదానికి మరోదానికి లింక్ లేకుండా పోయింది. తెలుగు న్యూస్ ఛానల్ లో వచ్చే వార్తలలాంటి డైలాగ్స్ అని చెప్పించి చిరాకు పెట్టించారు. కథ కరెక్ట్ గా లేకపోతే కథనం ఎలా ఉంటుందో ఈ కథనం అలానే ఉంది. సినిమాటోగ్రఫీ పరవాలేదు. శంకర్ అందించిన సంగీతం కర్ణ కటోరం దానికి తగ్గట్టుగానే వాటి ప్లేస్ మెంట్స్ వర్ణనాతీతం. సన్నివేశానికి నేపధ్య సంగీతానికి అసలు సంభంధం ఉండదు కాబట్టి కళ్ళు మూసుకొని నేపధ్య సంగీతం మాత్రమే వింటే చిన్న అందించిన నేపధ్య సంగీతం బాగుంది అనిపిస్తుంది. మాములుగా పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిటింగ్ ఉంటుంది ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ లోనే చేసేసారు సీన్ కి సీన్ కి సంభంధం ఉండదు. పోస్ట్ ప్రొడక్షన్ టైం లో ఎడిటర్ కి ఎడిటింగ్ అవకాశం పెద్దగా రాలేదు.


చండీ రివ్యూ: హైలెట్స్
  • వెతికినా దొరకదు

చండీ రివ్యూ: డ్రా బాక్స్
  • వెతికే ఓపిక కూడా ఉండదు

చండీ రివ్యూ: విశ్లేషణ
సముద్రకి అవకాశాలు ఎలా వస్తాయి ప్రతి ప్రేక్షకుడి మదిలో కదిలే ప్రశ్న ఇది, కేవలం ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అన్న ఒక్క కారణం తోనే చిత్రానికి వచ్చే ప్రేక్షకుడికి ఇప్పటివరకు సమాధానం దొరకలేదు ఈ చిత్రంలో కూడా అదే జరిగింది పైగా ఈ చిత్రం కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. కృష్ణం రాజు పాత్ర పవర్ ఫుల్ గా ఉండాలనుకోవడం తప్పు కాదు కాని ఆయన్ని పవర్ ఫుల్ గ చుపించాలేనప్పుడు వేరే నటుడిని తీసుకొని ఉండాలి కదా?. డైలాగ్స్ చాట భారతంలా పొడవుగా రాసుకుంటూ ప్రాసని చూసుకుంటూ వెళ్ళిపోయారు రెండు మాటల్లో చెప్పగలిగే విషయాలకి అన్ని వాక్యాలు ఎందుకు? . న్యూస్ పేపర్ చూసి సన్నివేశాలను రాసుకున్నారు సరే ప్రతి సన్నివేశం వెనక క్లాసు పీకడం ఎందుకు సముద్ర గారు? చిత్రంలో ప్రతి సీన్ కి అయితే పురాణాలూ కాకపోతే బ్రిటిష్ వాళ్ళ రెఫెరెన్స్ ఎందుకు? అల్లూరి సీతారామ రాజు అంటే కృష్ణ గారు గుర్తొస్తారు మరి పెద్ద ఎన్టీఆర్ ని ఎందుకు చూపించారు? అసలు ఈ చిత్రానికి అల్లూరి సీతారామ రాజు కి ఉన్న సంభంధం ఏమిటి అయన రెఫెరెన్స్ వాడకపోయినా చిత్రంలో ఏ మార్పు లేదు కదా? ఇలా ఎన్నో ప్రశ్నలు.. పాటలు ఒక ఎత్తయితే నేపధ్య సంగీతం మరో ఎత్తు ఒకటేమో కావలసిన దానికన్నా తక్కువ ఇంకొకటి ఉన్నదానికన్నా ఎక్కువ ... ప్రతి సీన్ క్లైమాక్స్ అని అనుకున్నారో ఏమో దర్శకుడు చిత్రాన్ని అలానే తెరకెక్కించారు. చండీ పాత్రను సరిగ్గా ఎలివేట్ చెయ్యకుండా చండీ చేత ఎం చేయించినా జనం అర్ధం చేసుకోలేరు అన్న విషయాన్నీ సముద్ర గారు ఎలా మరిచిపోయారో? ఇలాంటివి చాలానే ఉన్నాయి, మొత్తంగా చెప్పాలంటే గత చిత్రాలలో లానే మంచి కాన్సెప్ట్ ని ఎన్నుకున్న సముద్ర ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ చిత్రంలో భూతద్దం పెట్టి వెతికితే కనిపించే పోజిటివ్ పాయింట్ ప్రియమణి, ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్టు యిట్టె తెలిసిపోతుంది కాని ఏదయినా మంచి కథ కోసం కష్ట పడి ఉంటె కష్టానికి అయిన ఫలితం దక్కేది, రిలీజ్ రోజు మొదటి షో కి పది మంది ఉన్నారంటే నేను చెప్పినంత మాత్రాన ఈ చిత్రాన్ని చూసేస్తారు అని అనుకోవట్లేదు అయినా నా సలహా కూడా చూడకపోవడమే మంచి పని.


చివరగా
చండీ : వద్దండీ!!
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008

More Articles on Chandee Game | Chandee Game Wallpapers | Chandee Game Videos

" height='150' width='250' width="560" height="315" src="//www.youtube.com/embed/DGNOEWVFv5w" data-framedata-border="0">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: