నాని, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్నాని, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్స్లో నరేషన్, సెంటిమెంట్ సీన్స్
తమ కుటుంబాలకు అన్యాయం చేసిన ఓ వ్యక్తి గురించి ఐదుగురు ఆడవాళ్లు ఫేమస్ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్ధసారధి (నాని)ని కలుస్తారు. రాబరీ జరిగిన 14 నెలల తర్వాత వీరు పార్ధసారధిని కలవడం పోగొట్టుకున్న తమ వారి గురించి పార్ధసారధి హెల్ప్ అడగడం జరుగుతుంది. అయితే తను రాసే స్టోరీస్ లానే రివెంజ్ తీర్చుకోవాలనుకున్న ఆ లేడీ గ్యాంగ్ కు పార్ధసారధి అసలు విలన్ ఎవరన్నది కనిపెట్టే ప్రయత్నం మొదలుపెడతాడు. ఈ క్రమంలో రేసర్ దేవ్ (కార్తికేయ) మీద నానికి డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ రేసర్ కు ఆ ఐదుగురు లేడీస్ కు ఉన్న సంబంధం ఏంటి..? పెన్సిల్ పార్ధసారధి వాళ్ల రివెంజ్ ను తన రివెంజ్ లా ఎందుకు తీసుకున్నాడు..? చివరగా రివెంజ్ కథ ఎలా ముగిసింది అన్నది సినిమా.
నాచురల్ స్టార్ నాని మాత్రమే చేయగల పాత్ర పెన్సిల్ పార్ధసారధి అనేలా చేశాడు. కామెడీ టైమింగ్ పాత్ర యొక్క భారాన్ని మొత్తం తన మీద వేసుకున్నాడు. నాని ఎందుకు నాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో మరోసారి అర్ధమవుతుంది. ఇక ప్రియాంకా అరుల్ మోహన్ కూడా బాగానే చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు కూడా సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. విలన్ గా కార్తికేయ ది బెస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది. వెన్నెల కిశోర్, ప్రియదర్శిల కామెడీ మెప్పించింది.
నానీస్ గ్యాంగ్ లీడర్ కు పీసి శ్రీరాం సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయ్యింది. అనిరుద్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక కథ, కథనాల్లో దర్శకుడు విక్రం కుమార్ ప్రతిభ చూపించాడు. కథనంలో లోపాలు ఉన్నా అవి సినిమా మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సినిమాతో మరోసారి విక్రం కె కుమార్ మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా ఉంది.
కొత్తరకం కథలతో వస్తున్న నాచురల్ స్టార్ నాని స్టార్ అనే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ నాని ఈ ఇయర్ జెర్సీ అంటూ ఓ కొత్త కథతో వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా కన్నా సినిమా అటెంప్ట్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది.
దర్శకుడు విక్రం కె కుమార్ ఓ కొత్త కథను చెప్పాలని చూశారు. అయితే దాన్ని నడిపించిన కథనం మాత్రం కాస్త పాతగానే అనిపించింది. అయితే అదేమి సినిమా మీద ప్రభావం చూపించలేదు. ఓపెనింగ్ బ్యాంక్ రాబరీ సీన్స్ చాలా బాగా తీశాడు డైరక్టర్ విక్రం. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. థ్రిల్లర్ కథకు తగినట్టుగా కథనం కూడా రాసుకున్నాడు విక్రం. కార్తికేయ ఎంట్రీ అయ్యాడో అప్పుడు సినిమా వేగం పెంచుకుంటుంది.
సినిమా అంతా నాని తన భుజాన వేసుకుని నడిపించాడు. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. నాని సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే విక్రం కుమార్ స్క్రీన్ ప్లే అలవాటు పడ్డ ప్రేక్షకలకు గ్యాంగ్ లీడర్ తెగ నచ్చేస్తుంది. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు పడినట్టే.
నాని, లక్ష్మీ, కార్తికేయ, వెన్నెల కిషోర్,ప్రియాంక అరుల్ మోహన్నానీస్ గ్యాంగ్ లీడర్.. బొమ్మ సూపర్ హిట్టు..!