తుమ్మెద : రివ్యూ
Rating : 0
మనోహర్ (రాజా) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మనోహర్ వెంకీ అలియాస్ విక్కీ(విజయ్ ధరణ్) మంచి ఫ్రెండ్స్. మొనోహర్ కి అమ్మాయిలంటే పడదు, కానీ తన పక్క ఫ్లాట్ లో దిగిన అర్చన(వర్ష పాండే)ని చూసి ప్రేమలో పడతాడు. అదే సమయంలో వెంకీ కూడా రోజా(అక్షయ)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే అర్చన మనోహర్ ని ఇష్టపడుతుంది, కానీ చెప్పా పెట్టకుండా ఓ రోజు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. మరోవైపు రోజాకి వెంకీ అంటే ఇష్టం లేదని తెలుస్తుంది. దాంతో వెంకీ తన ప్రేమ ఎలాగో సక్సెస్ కాలేదు మనోహర్ ని అన్నా అర్చనతో కలపాలని ప్రయత్నిస్తున్న సమయంలో రోజా తనకి అర్చన తెలుసని తను చెప్పిన పని చేస్తే వారిద్దరినీ కలపడానికి సాయం చేస్తాననిమాతిస్తుంది. దాంతో వెంకీ ఆ పని చెయ్యడానికి ఒప్పుకుంటాడు. చివరికి మనోహర్ అర్చనలని వెంకీ కలిపాడా? లేదా? అసలు రోజా వెంకీని చెయ్యమన్న పని ఏమిటి? అసలు రోజాకి అర్చనకి గల సంబంధం ఏమిటి? అనేది మీరు తెరపైనే చూడాలి..
చిత్రంలో ప్రచారానికి ప్రధాన అస్త్రం అయిన రాజ నటన గురించి చాలా చెప్పాలి , చాలా రోజుల తరువాత తెర మీద కనిపించిన రాజ నటన "మరిచిపోయారు". ఒక్కో సన్నివేశంలో ఒక్కో హవాభావం అవసరం అయినప్పుడు అన్నింటికీ ఒకే రకమయిన ఎక్స్ప్రెషన్ తో ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రధాన హీరో అయిన విజయ్ నటనలో "అ" అక్షరం నేర్చుకొని "అం అః" వరకు వచ్చు అనుకోని ప్రేక్షకుల చేత హాహాకారాలు పెట్టించాడు. వర్ష నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి , అందానికి అవకాశం లేదు అభినయానికి ఆస్కారం లేదు సినిమాలో ఈ పాత్రకి బలం లేదు, ప్రధాన హీరోయిన్ కి రెండే డైలాగ్ లు ఉన్న మొదటి చిత్రం బహుశా ఇదేనేమో, ఇక ఇంకో హీరోయిన్ అయిన అక్షయ చిత్రంలో అందరి నటుల నటనను తనే నటించేసి చిత్రాన్ని బాలన్స్ చేసేయాలని ప్రయత్నించింది కాని అవసరం కన్నా ఎక్కువగా నటిస్తున్నాం అన్న విషయాన్నీ గమనించలేకపోయింది. ఇక చాలా మంది నటులయితే ఉన్నారు కాని వారి పాత్రలకు అవకాశం రాకపోవడంతో వారు కూడా నటించలేదు. దర్శకుడు నారాయణ ఎం చెప్పాలనుకున్నాడో ఆయనకి ఎం చెప్పాడో మనకి క్లారిటీ ఉండదు కథాపరంగా ఏదో ఉన్నా కథనం విషయంలో అయన విఫలం అయిన తీరు దారుణం కనీసం ఉండాల్సిన అంశాలు కూడా ఉండవు.డైలాగ్స్ గురించి చెప్పుకోవాలంటే పాత సినిమాల్లో కూడా ఇంత డైలాగ్స్ ఉండవు. సినిమాటోగ్రఫీ అందించిన మహి, బాగోలేదు అని అనిపించుకోకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాడు కాని..... సినిమాటోగ్రఫీ "బాగోలేదు" . ఎడిటర్ సత్య తనకి తెలిసిన విద్య మొత్తం చూపించాలన్న ప్రయత్నంలో అవసరం లేకపోయినా ట్రాన్సిషన్ లు వాడటం, దీనికి బోనస్ గా సీన్ కి సీన్ కి సంబంధం లేకపోవడంతో బ్రేక్ ఇరుక్కుపోయిన బండిలా జర్క్ లు ఇచ్చుకుంటూ కదిలినట్టు ఉంటుంది సినిమా, సంగీతం అందించిన రాబిన్ ఏదో పరవాలేదనిపించాడు , ఎడిటర్ లానే ఈయన కూడా ఒక్క సీన్ లోనే రకరకాల ఫీల్ ఉండే సంగీతం అందించిన ప్రేక్షకుడిని హింసించడంలో తన పాత్ర పోషించాడు. నిర్మాణ విలువల గురించి మాట్లాడకపోవడమే మంచిది...ఒక చిత్రాన్ని ఎలా తీస్తే హిట్ అవుతుంది అని చెప్పడానికి తీసే సినిమాలు కొన్ని ఇది ఒక రకం , ఒక సినిమా ఫ్లొప్ అవ్వాలంటే ఎలా తీయాలి అని చెప్పే చిత్రాలు ఇంకొక రకం ... ఈ సంవత్సరం రెండో రకం చిత్రాలు చాలానే వచ్చాయి. ఈరోజు వచ్చిన తుమ్మెద కూడా రెండవ రకం చిత్రమే, ఈ చిత్ర శీర్షికలకి థియేటర్ లో పరిస్థితికి అసలు సంబంధం ఉండదు..
"అమ్మ చేతి వంట లాంటి కమ్మనయిన ప్రేమకథ " - ఈ చిత్రంలో అసలు ప్రేమకథ ఎక్కడ ఉందని.. ఈ చిత్రం చుసిన ప్రేక్షకుడు అమ్మ చేతి వంటంటే భయపడేలా చేసారు. వర్ష అనే నటికీ పాత్ర అయితే ఇచ్చారు కాని "నాలుగు" డైలాగ్ లు కూడా ఇచ్చి ఉంటె ఆ పాత్రకి చిత్రానికి సంభంధం ఉంది అని ప్రేక్షకుడికి అర్ధం అయ్యుండేది.. ఈ చిత్రం గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం వృధా ప్రయాస ... ఈ చిత్రాన్ని మీకు చూడాలని ఉన్నా రేపటికి ఏ థియేటర్ లో కనపడదు కాబట్టి మేము మీకేం సలహా ఇవ్వాలని అనుకోవట్లేదు...
Vijay Dharan,Varsha Pandey,Akshaya,Rajaతుమ్మెద - ప్రేమ కథ కాదు ప్రేక్షకుడి వ్యథ