కాన్సెప్ట్, నటీనటుల ప్రదర్శన కాన్సెప్ట్, నటీనటుల ప్రదర్శన ఎంతకీ ముగియని చిత్రం(నిడివి),కథనం , ఎడిటింగ్, నేపధ్య సంగీతం.రాజీవ్ మాథ్యుస్ (సుధీర్ రెడ్డి) మరియు గౌతం(యువ చంద్ర) ఇద్దరు స్నేహితులు , కాలేజీ రోజుల్లో గౌతం ద్వారా పరిచయం అయిన ప్రియ(పావని రెడ్డి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రాజీవ్, లండన్ లో మెడిసిన్ పూర్తి చేసుకొని ఇండియా కి తిరిగి వస్తాడు గౌతం , ఇక్కడికి రాగానే గౌతం, రాజీవ్ ఫార్మ్ హౌస్ లో ఉంటాడు.. ఇది ఏ మాత్రం ప్రియకి నచ్చదు అదే సమయంలో అక్కడే పని చేసే ఒక పనిమనిషి ప్రమాదవశాత్తు చనిపోతుంది.. దాన్ని చూసి ప్రియ మనస్తాపం జరుగుతుంది. ఇదే సమయంలో గౌతం కి రేఖ(గజెల్ సోమయ్య) పరిచయం అవుతుంది. ఆ తరువాత కొద్ది రోజులకి గౌతం గోవా కి వెళ్లి అక్కడ రేఖ తో ఉండటం ప్రారంబిస్తాడు, సరిగ్గా ఆర్నెల్ల తరువాత రాజీవ్ కి ఆరోగ్యం బాగాలేదని గౌతం కి కాల్ వస్తుంది. హుటాహుటిన బయలుదేరిన వచ్చిన గౌతం కి రాజీవ్ చెప్పిన విషయాలు ఆశ్చర్య పరుస్తాయి.. తన భార్యకి దయ్యం పట్టింది అంటాడు రాజీవ్ ? అసలు ఎం జరిగింది నిజంగానే దయ్యం పట్టిందా? అన్న అంశాలు తెర మీదనే చూడాలి ..సుధీర్ రెడ్డి ఈ చిత్రం మొత్తం ఇతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది మొదట్లో కాస్త ఓవర్ గా నటించినా కీలక సన్నివేశాల వద్ద ఇతని నటన చాలా బాగుంది కాని కొన్ని సన్నివేశాలలో మాత్రం కాస్త డోస్ పెంచి నటించేశారు..యువ చంద్ర నటన బాగుంది మంచి ఈజ్ తో నటించాడు కాని ఇంకా మెరుగ్గా నటించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.. పావని రెడ్డి నటన బాగుంది, దయ్యం లా నటించడంలో సఫలం అయ్యింది.. భయపెట్టడం మాట అటుంచితే ఆసక్తిని కలిగించింది ఆ పాత్ర మీద .. రేఖ పాత్ర పూర్తిగా గ్లామర్ కోసమే ఉంచినట్టు అనిపిస్తుంది ఆ విషయంలో కొంతవరకు సఫలం అయ్యింది ఈ పాత్ర, కాని డైలాగ్స్ మాత్రం వాక్యాన్ని ముక్కలు ముక్కలు చేసి పొడి పొడిగా చెప్పింది .. పోలీస్ పాత్రలో చేసిన సందీప్ ఆకట్టుకున్నాడు.. వేణు కామెడీ అసలు పండలేదు..దర్శకుడు రాహుల్ సంక్రితియన్ కాస్త విభిన్నమయిన కథాంశాన్ని ఎంచుకున్నారు కాని కథనం దగ్గరకి వచ్చేసరికి పూర్తిగా పట్టు తప్పారు సరిగ్గా వంద నిమిషాలు కూడా లేని చిత్రాన్ని నూట యాభై నిమిషాల పాటు సాగదీసి చెప్పారు.. ప్రతి సన్నివేశాన్ని ముగించడానికి పలు అవకాశాలు ఉన్నా కూడా ఏ ఒక్క సన్నివేశాన్ని ముగించలేదు అన్నీ పెద్ద పెద్ద సన్నివేశాలని మనం తెర మీద చూస్తాం.. దాదాపుగా ప్రతి సన్నివేశం నిడివి ఎక్కువగానే ఉంటుంది .. ఇది సరిపోదని బలవంతపు కామెడీ కూడా తోడయ్యింది.. డైలాగ్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది.. దర్శకుడిగా ఇది మొదటి చిత్రం కాబట్టే చాలా తప్పులు కనిపిస్తాయి, భయం పుట్టించాల్సిన సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు .. లేవు అంటే లేవని కావు అవేవి భయపెట్టేలా లేవు .. అతని దగ్గర ఒక సస్పెన్స్ ఉంది దాన్ని కాపాడుకుంటూ రావాలి అదే సమయంలో హారర్ ని సృష్టించాలి నిజానికి ఇది చాలా కష్టమయిన పని సరిగ్గా నిర్వర్తిస్తే మంచి చిత్రంగా మలచవచ్చు దర్శకుడు అదేం పట్టించుకోకుండా ప్రేక్షకులు భయపడతారులే అనుకోని పేలవమయిన సన్నివేశాలు రచించుకొని ఇంకా పేలవంగా తెరకెక్కించారు.. ప్రవీణ్ వనమాలీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకోలేకపోయింది ఎక్కువగా జూమ్స్ వెళ్ళడం అవసరం లేకపోయినా ఎక్స్త్రీం క్లోజ్ అప్స్ వాడటం వంటివి చేసారు కాని రాత్రి పూట తీసిన సన్నివేశాలు అంత క్లారిటీ గా కనిపించడంలో ఈయన కృషి చాలానే ఉంది ...సంగీతం అందించిన వంశి మరియు హరి బాగా హెవీ గా సంగీతాన్ని అందించారు దీనివలన చిత్రం నుండి ప్రేక్షకుడు పూర్తిగా బయటకి వచ్చేసాడు.. హారర్ చిత్రం ఎంత నిశబ్దంగా ఉంటె సినిమా అంత భయంకరంగా ఉంటుంది.. ఈ పాయింట్ ని సంగీత దర్శకులు మరిచిపోయారు ఎక్కడా కాస్తయిన సమయం ఇవ్వకుండా లౌడ్ మ్యూజిక్ తో నింపేశారు.. ఎడిటర్ చాలా సన్నివేశాలని కత్తిరించకుండా వదిలేసాడు కత్తిరించడం మొదలు పెడితే దాదాపుగా గంట చిత్రాన్ని కత్తిరించినా చిత్రంలో మార్పు ఉండదు .. ఫ్రైడే ఫిలిమ్స్ వారి నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి ..మనిషి ఆశ కి అమాయకత్వానికి దయ్యాన్ని కలిపి చెప్పిన కథ ఇది , నిజానికి చాలా మంచి కాన్సెప్ట్ ఇదే చిత్రాన్ని సక్రమంగా తీసి ఉంటె ఈ చిత్రం తెలుగు బాషకి "పిజ్జా" అయ్యి ఉండేది కాని దర్శకుడి తప్పిదాల వలన తెలుగు "ది ఎండ్" గానే మిగిలిపోయింది.. చెప్పాలనుకున్న పాయింట్ వైపు దూసుకేల్లకుండా పొడవయిన సన్నివేశాలతో కాలక్షేపం చెయ్యడం ఎందుకో మరి, ఈ మధ్య చిత్రాలలో ఇది ఎక్కువగా గమనించవచ్చు.. చిత్రంలో ఒక పాత్ర ఉన్న సన్నివేశాలన్నింటిని కత్తిరించినా చిత్ర కథ ఇసుమంతయినా తేడా రాదంటే ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది అటువంటి పాత్రనే గజల్ సోమయ్య వేసింది. ప్రేక్షకులను భయపెట్టాలంటే రెండే మార్గాలు ఒకటి సినిమాటోగ్రఫీ రెండు సంగీతం ఈ చిత్రంలో రెండు దారుణంగా విఫలం అయ్యాయి .. భయపడటం మాట అటుంచి థ్రిల్లింగ్ గా ఫీల్ అవ్వాల్సిన ట్విస్ట్ కూడా అప్పటికే ప్రేక్షకుడు నీరసపడిపోయి ఉండటం వలన చప్పగా సాగిపోయింది.. హారర్ చెయ్యాలా థ్రిల్లర్ చెయ్యలా అన్న కన్ఫ్యూషన్ లో డ్రామా ఎక్కువగా చేసేసాడు దర్శకుడు.. ఈ చిత్ర మొదటి అర్ధ భాగం అయిన కాస్త ఆసక్తి కరమయిన అంశాలతో సాగుతుంది రెండవ అర్ధ భాగం వచ్చే సరికి ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఆసక్తి కలిగించదు .. మీరు భయపడాలి అని దృడంగా నిర్ణయించుకొని వచ్చి థియేటర్ లో కూర్చున్న భయపడే అవకాశాలు పది శాతం మాత్రమే ఉంది ... ఒకవేళ మీరు ఎంత హారర్ ప్రియులు అయినా సరే ఈ చిత్రం మిమ్మల్ని ఆకట్టుకోడం కష్టం .. తరువాత మీ ఇష్టం ..Sudheer Reddy, Yuva Chandraa, Gazal Somaiah, Pavani Reddy, Venu (Tillu), Sundeep Ved, Master Veduది ఎండ్ : 'నో' ఎండ్
మరింత సమాచారం తెలుసుకోండి: