Lucky Live Tweet Review || Lucky English Review
హీరో శ్రీకాంత్ నటించిన కొత్త సినిమా లక్కీ. ఇటీవల కాలంలో ఆశించిన విజయాలు పొందలేక పోతున్న శ్రీకాంత్ ఈ లక్కీ తనకు మళ్లీ లక్ తీసుకొస్తుందని ఆశగా ఉన్నాడు. ఈ సినిమా కోసం శ్రీకాంత్ గాయకుడిగా మారడం విశేషం.
శ్రీకాంత్ సోలో హీరోగా నటించిన ఈ లక్కీ సినిమా ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
లక్ష్మీ నారాయణ (శ్రీకాంత్)ను అంతా లక్కీ అని పిలుస్తుంటారు. లక్కీకి ఆడవాళ్లంటే చిరాకు. ఆడవాళ్ళు పుట్టిన నుంచే ఈ లోకంలో సంతోషం లేకుండా పోయిందని బాధపడుతుంటాడు. బస్సుల్లో, ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఆడవాళ్లదే రాజ్యమని భావిస్తుంటాడు.
అయితే, ఒకసారి కుటుంబ సమేతంగా లక్కీ అరకు వెళ్ళతాడు. అక్కడ ఆయిష్టంగానే ఒక పూజా కార్యక్రమంలో పాల్గొంటాడు. అప్పుడు ఆమ్మవారు ఒక అతీంద్రయ శక్తిని లక్కీకి ప్రసాదిస్తుంది. ఈ శక్తితో ఆడవాళ్లు మనసులో ఏం అనుకుంటున్నారో.. లక్కీకి వినిపిస్తుంది.
ఈ శక్తితో లక్కీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది.. సమాజానికి ఎలా సహాయ పడ్డాడు అనేది చిత్రకధ.
నటీనటుల ప్రతిభ :
నటుడిగా ఈ సినిమా ప్రధాన భారం అంతా హీరో శ్రీకాంత్ మోసాడు. ఈ సినిమా కోసం గాయకుడిగాను శ్రీకాంత్ మారాడు. ఆడవాళ్లను ద్వేషించేటప్పుడు, అభిమానించేటప్పుడు.. ఈ రెండు సన్నివేశాల్లోనూ శ్రీకాంత్ నటన మెచ్చుకునే విధంగా ఉంది. శ్రీకాంత్ కు జోడీగా నటించిన మేఘన కూడా ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ కు బాస్ గా నటించిన రోజా నటన బావుంది. సన, ఏవిఎస్, బ్రహ్మనందం తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఒకే. ‘అబ్బాయిలు బ్లూటూత్ వంటి వారు, అమ్మాయిలు వైఫై కనెక్షన్స్ లాంటి వారు’, ‘కష్టపడి పని చేయడం బానిసత్వం-ఇష్టపడి పని చేయడం నా మనస్తత్వం’ వంటి మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. సినిమాకు తగినట్లుగా నిర్మాతలు ఖర్చుపెట్టారు.
కధను సరిగ్గానే ఎంచుకున్న దర్శకుడు కథనం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఆడవాళ్లను హీరో అంతగా ద్వేషించడానికి కారణం ఏమీ ఉండదు. పైగా ఆడవాళ్లను అంతగా ద్వేషించే హీరో పెళ్లి చేసుకుంటాడు, తన భార్యతో ప్రేమగానే ఉంటాడు. సినిమా చాలా చోట్ల బోర్ గా సాగుతుంది. స్ర్కీన్ ప్లే మరింత పట్టుగా ఉండి ఉంటే సినిమాకు మంచి ఫలితం వచ్చి ఉండేది.
హైలెట్స్ :
శ్రీకాంత్ నటన, కామెడీ సన్నివేశాలు, అక్కడక్కడ ఆకట్టుకునే మాటలు
డ్రాబ్యాక్స్ :
స్లోగా సాగే కథనం, పట్టుగా లేని స్కీన్ ప్లే
చివరగా :
బాక్సాఫీస్ వద్ద శ్రీకాంత్ కు మరోసారి అన్ లక్కీ
Pasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com
Editor can be reached at: editor@apherald.com
More Articles on Lucky || Lucky Photos & Wallpapers || Lucky Videos
" height='150' width='250' width="560" height="315" src="https://www.youtube.com/embed/6FcnZVavgiM" data-framedata-border="0" allowfullscreen STYLE="margin-left:30px">