శర్వానంద్ , నిత్యామీనన్ పెర్ఫామెన్స్ & కెమిస్ట్రీ , సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ , గోపి సుందర్ మ్యూజిక్ , జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ , పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ , ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్ శర్వానంద్ , నిత్యామీనన్ పెర్ఫామెన్స్ & కెమిస్ట్రీ , సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ , గోపి సుందర్ మ్యూజిక్ , జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ , పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ , ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్ , కథలో స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం , రొటీన్ గా ఊహాజనితంగా అనిపించే సెకండాఫ్ , ఎడిటింగ్ , డ్రాగ్ చేసిన క్లైమాక్స్రాజారాం(శర్వానంద్)కి ఒక రన్నర్ గా నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యం ఉంటుంది. దాని కోసం ప్రతి రోజూ సాధన చేస్తుంటాడు. ఆ టైంలోనే తన కాలేజ్ లో చదివే ఒక ముస్లీం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్)ని చూసి ప్రేమలో పడతాడు. నజీర తన ముఖం చూపించకుండా తన వెంటపడుతూ, తన లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాలుగా రాజారాంకి సాయపడుతుంది. అనుకున్నట్టుగానే రాజారాం నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు, నజీరని కూడా చూస్తాడు. వాళ్ళ ప్రేమని చెప్పుకొని, ఇక పెళ్ళి చేసుకోవాల్సిన టైంలో నజీర రాజారాంని వదిలి వెళ్ళిపోతుంది. అక్కడితో వారి ప్రేమకి బ్రేక్ పడుతుంది. అసలు మనస్పూర్తిగా ప్రేమించిన రాజారాం ని వదిలి నజీర ఎందుకు వెళ్ళిపోయింది.? ప్రేమలో విడిపోయాక వీరిద్దరి లైఫ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి.? వీరి స్వచ్చమైన ప్రేమ చివరికి కలిసిందా.? లేదా.? ఒకవేళ కలిస్తే ఎవరి వల్ల కలిసారు.? అనే అంశాలను వెండితెరపై చూసి ఫీలవ్వాల్సిందే.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఒక ప్యూర్ లవ్ స్టొరీ. అలాంటి సినిమాకి కావాల్సింది ఆ లవ్ స్టొరీలో జీవించే నటీనటులు. అలాంటి నటీనటులే క్రాంతి మాధవ్ కథకి దొరికారని చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నంత సేపూ శర్వానంద్ - నిత్యా మీనన్ లు కనిపించరు, వారు చేసిన రాజారాం - నజీరలు మాత్రమే కనిపిస్తారు. ఇలా చెప్పాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారో.. శర్వానంద్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా లుక్స్ పరంగా, హావభావాల పరంగా సూపర్బ్ గా చేసాడు. మలయాళ కుట్టి అయిన నిత్యా మీనన్ అదే మలయాళ వాసన ఫ్లేవర్ ని ఈ సినిమాలో కంటిన్యూ చేసింది. ముస్లీం అమ్మాయిగా మంచి నటనని కనబరిచి తెలుగు ప్రేక్షకులను మరోసారి ప్రేమలో పడేసింది. వీరిద్దరీ కెమిస్ట్రీనే ఈ సినిమాకి మేజర్ హైలైట్. అలాగే చిన్న రోల్స్ అయినా కథకి చాలా ప్రాముఖ్యత పాత్రలు చేసిన పునర్నవి, తేజస్విల నటన సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. శర్వానంద్ కి తల్లి పాత్ర చేసిన ఆమె నటన కూడా బాగుంది. ఇక సినిమాలో పలు ముఖ్య పాత్రలు చేసిన నాజర్, చిన్నా, సన తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయారు. నటీనటుల విభాగంలో శర్వానంద్ - నిత్యా మీనన్ సినిమాకి ఎంత పెద్ద హైలైట్ అయ్యారో అలానే టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో కూడా ఓ ఉరు సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసారు. వాళ్ళే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మరియు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్. సాయి మాధవ్ రాసిన ప్రతి డైలాగ్ లోనూ ఎంతో అర్థముంది, అలాగే ప్రతి సన్నివేశానికి అవి ప్రాణం పోశాయి. ఉదాహరణకి 'పాటకి మనసు ఉంటుంది కాని మతం ఉండదు, కంటికి మనసుకు కామన్ సెన్స్ ఉండదు అందుకే వాటితో తిరిగితే చెడిపోతాం, జేబులో రూపాయి లేకపోతే అమ్మాయిని ట్రై చెయ్యచ్చు గానీ, డబ్బు లేకుండా లక్ష్యాన్ని ప్రేమించకూడదా.. లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుంది రా'. ఇక జ్ఞానశేఖర్ డైరెక్టర్ సీన్ పేపర్ పై రాసుకున్న సీన్స్ కి అందమైన దృశ్య రూపాన్ని ఇస్తే గోపి సుందర్ ఆ దృశ్యాలకి తన సంగీతంతో జీవం పోసాడు. అందుకే ఈ మూడు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది కానీ కొన్ని సాగదీసినట్టు ఉన్నాయి అనే సీన్స్ ని కత్తిరించేసి ఉంటే బాగుండేది. ఈ సినిమా ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన క్రాంతి మాధవ్ విషయానికి వస్తే.. ఆయన కథా పరంగా కొత్తగా ఏమీ ట్రై చెయ్యలేదు.. మనకు బాగా పరిచయం ఉన్న హిందూ - ముస్లీం ప్రేమకథనే మళ్ళీ చూపించాడు. మొదటిసారి బాగా డీప్ గా చెప్పడం వల్ల కమర్షియల్ గా ఫెయిల్ అయ్యానని ఈ సారి ఇలా ట్రై చేసినట్టు ఉన్నాడు. కానీ కథ సింపుల్ కావడం వలన ఎక్కువ సీన్స్ రాసుకోవడం వలన కథనం స్లో అయిపొయింది. కథనం స్లోగా ఉన్నా డైరెక్టర్ గా ప్రేమలోని మధురాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యగలిగాడు కాబట్టి ఈ సినిమాతో కొంతవరకూ క్రాంతి మాధవ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ, కథనం విషయంలో పెద్దగా మార్కులు తెచ్చుకోకపోయినా డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇక నుంచి అయినా కథ- కథనంపై శ్రద్ధ తీసుకుంటే క్రాంతి మాధవ్ నుంచి మంచి సినిమాలు ఆశించవచ్చు. చివరిగా ఇలాంటి సినిమాకి సపోర్ట్ ఇచ్చిన నిర్మాత కెఎ వల్లభ ఈ సినిమాకి నిర్మాణ విలువల పరంగా మంచి రిచ్ ఫీల్ ని తీసుకొచ్చాడు. ఒక అందమైన ఫీల్ గుడ్ లవ్ స్టొరీని చెప్పాలనుకునేటప్పుడు నటీనటుల మధ్య కెమిస్ట్రీ మాత్రమే కాదు కథలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ అలా లేదు అంటే ఆ సినిమా అనుకున్న స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ అవ్వదు. అదే సమస్య ఈ సినిమాకి కూడా వచ్చింది. నటీనటులైన శర్వానంద్, నిత్యా మీనన్ ల పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ డైలాగ్స్, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ మ్యూజిక్ ఇలా రెన్ని బాగున్నా క్రాంతి మాధవ్ సీన్స్ ని సరిగా రాసుకోకపోవడం వలన జస్ట్ యావరేజ్ గా నిలిచిపోయింది. ఎందుకంటే డైరెక్టర్ హీరోకి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పెట్టాడు కానీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాల్ని ఆసక్తికా రాసుకోకపోగా రియలిస్టిక్ గా కూడా లేవు. అలాగే హీరో మదర్ పాత్రని కారణం లేకుండా చంపేయడం లాంటివి తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో కొత్త పాయింట్ ఏమీ లేకపోయినా మీకు మాత్రం చాలా ఫ్రెష్ ఫీలింగ్ మరియు ఓ కొత్త తరహా ప్రేమ కథ చూస్తున్నామా అనే ఫీలింగ్ ని మాత్రం కలిగిస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ సినిమాల మీద మీకు ఎంతో ఊరటని కలిగిస్తుంది. ఓవరాల్ గా ఫీల్ గుడ్ లవ్ స్టొరీ నచ్చే తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మళయాళ సినిమా ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. అది మీకు చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. ఈ సినిమా బి,సి సెంటర్స్ లో పెద్దగా ఎక్కకపోయినా మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్స్ క్లాస్ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేస్తుంది.Sharwanand,Nithya Menon,Kranthi Madhav,K S Vallabha,Gopi Sundar.పంచ్ లైన్ : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - మలయాళ వాసనకి తెలుగు రంగులు అద్దిన ప్రేమకథ.
మరింత సమాచారం తెలుసుకోండి: