Thuppakki Tweet Review || Thuppakki Full English Review
తమిళ హీరో విజయ్ నటించిన కొత్త సినిమాను తుపాకీ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాలో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటించింది. స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. గజని, స్టాలిన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మురగదాస్ విశేషంగా అకట్టుకున్నారు.
దీంతో ఈ మురగదాస్ తుపాకీ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ తుపాకీ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
ఇండియన్ ఆర్మీ లో కల్నల్ మరియు డిఫెన్స్ ఇంటెలజెన్సీ ఎజెంట్ గా పని చేసే జగదీష్ (విజయ్) తన సెలవులను గడపటానికి ముంబాయి లోని తన ఇంటికి వస్తాడు. నిషా ( కాజల్ అగర్వాల్) తో అతని పెళ్లి చేయడానికి అతని ఇంట్లో ప్రయత్నిస్తారు. కొన్ని కొన్ని సంఘటనలతో చివరికి ఇద్దరూ ప్రేమలో పడతారు. నిషాతో జరిగిన ఒక సరదా సంఘటన కారణంగా లోకల్ బస్ లో జగదీష్ ప్రయాణిస్తాడు. అప్పుడు స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ లతో విజయ్ తలపడతాడు. తరువాత తన బెటాలియన్ తో 12 మంది స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ లను మట్టుపెడతాడు. దీంతో స్లీపర్ సెల్ హెడ్ ‘విద్యత్ జమ్మల్’ జగదీష్ ను అంతమొందించడానికి రంగంలోకి దిగుతాడు. విలన్ ను జగదీష్ ఎలా ఎదుర్కొన్నాడు. ముంబయిలో ఉన్న మొత్తం స్లీపర్ సెల్ వ్యవస్థను జగదీష్ ఎలా నిర్మూలించాడు అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
నటీనటుల ప్రతిభ :
మురుగదాస్ ఈ సినిమాలో హీరో పాత్రను చాలా శక్తివంతంగా తీర్చిదిద్దాడు. మురుగదాస్ అంచనాలను విజయ్ చేరుకోలేకపోయినా, ఫరవాలేదనిపిస్తాడు. కాజల్ తన పాత్ర మేరకు జీవించింది. విలన్ పాత్రధారి ఆకట్టుకుంటాడు. అతని బాడీ లాంగ్వెజ్ కూడా బావుంది. మిగిలిన వారు తమ పాత్రలలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
హరీష్ జైరాజ్ సంగీతంలో ఆకట్టుకునే పాటలు లేవు. సాహిత్యం కూడా అలానే ఉంది. నేపధ్య సంగీతం అక్కడక్కడా బావుంది. ఫోటోగ్రఫీ ఓకే. దర్శకుడు మురుగదాస్ తీసుకున్న భారతీయ ఆర్మీ- స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ కధాంశం బావుంది. అలానే సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచాడు. హీరో బెటాలియన్ 12 మంది స్లీపర్ సెల్ టెర్రరిస్టులను చంపడం చాలా ఉద్విగ్నంగా సాగుతుంది. విలన్ పాత్ర రూపకల్పన, హీరో అతన్ని ఎదుర్కొనే తీరు బావుంటాయి.
లవ్, కామెడీ సీన్లు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా సందేశంతో కూడిన కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
హైలెట్స్ :
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం, హీరో-విలన్ పాత్రల రూపకల్పన
డ్రాబ్యాక్స్ :
పాటలు, విజయ్-కాజల్ జోడి, లవ్-కామెడీ సీన్లు అకట్టుకునే విధంగా లేకపోవడం.
చివరగా :
మరింత పౌడర్ జతచేస్తే ‘తుపాకీ’ మరింతగా పేలి ఉండేది.
More Articles on Thuppakki || Thuppakki Photos & Wallpapers || Thuppakki Videos
" height='150' width='250' width="560" height="315" src=" https://www.youtube.com/embed/HHJsUykVWk0 " data-framedata-border="0" allowfullscreen STYLE="margin-left:30px">