శ్యామ్ సింగరాయ్ : అశ్లీలత లేదు... అసభ్యం అసలే లేదు

Vennelakanti Sreedhar

తెలుగు సినిమాల్లో చాలా కాలంగా హీరోయిన్లకు ప్రాధాన్యత తగ్గుతోంది అనే మాట , విమర్శ వినిపిస్తోంది. కేవలం హీరో పక్కన ఓ అందగత్తే ఉంటేచాలు అంతకు మించి ఇంపార్టెన్స్ అవసరం లేదు అన్న రీతిలో తెలుగు సినిమాలు నడిచాయి.   కురుచ గుడ్డలు, గంతులుంటే చాలు అన్న రీతిలో హీరోయిన్ల పాత్ర పరిమితమై పోయింది. అయితే  ఈ ట్రెండ్ కు శ్యామ్ సింగరాయ్ చిత్రం కొంచె దూరంగా ఉన్నట్లు అనిపించింది. ఈ మార్ప మంచిదే. హీరోయిన్ల   పాత్రలకు కూడా ప్రాధాన్యత పెరగడం ఒకింత సంతోషించ తగ్గ పరిణామం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాయన్ కొత్త తరం ఆలోచనను పుణికిపుచ్చుకున్నట్లు గా కనిపిస్తోంది. మారుతున్న కాలాలు, ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని కొన్ని డైలాగులు జనహృదయాలను మీటాయని చెప్పవచ్చు. నదినీ, నాట్యాన్ని కలబోసి చెప్పిన ...ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యం నీ సొంతం... ఈ డైలాగ్ గుండలకు హత్తుకుంటుంది. సామాజిక దురాచారం  దేవదాసి పాత్రలో సాయి పల్లవి పరిణితికి మించిన తన నటనను ప్రదర్శించారు. ఆమె డాన్స్ కోసం ఓ పాటను కూడా దర్శక నిర్మాతలు ఇందలో ఇమిడ్చారు.  రొటీన్ గా సాగే తెలుగు సినిమా కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రొటీన్ చట్రాన్ని పక్కకు తప్పించి, నూతనత్వాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలని దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఆరాటపడినట్లు కనిపిస్తోంది.

మొదటి అర్థభాగం చాలా సాదా సీదా జరిగినా, శ్యామ్ సింగరాయ్ పాత్ర తో కథ, కథనం పూర్తిగా మారిపోతాయి. సాయి పల్లవి నటనా తీరు కూడా మారిపోతుంది. శ్యామ్ సింగరాయ్ లో దేవదాసి కాన్సెప్ట్ పిసరంత ఎక్కువ టైం చూపించినట్టు అనిపిస్తుంది. నానీ నటన గురించి పెద్ద గా సమీక్షించాల్సింది, విమర్శించాల్సిందీ ఏమీ లేదు. ఎందుకంటే నానీ నేచురల్ స్థార్ అని ఎప్పుడో ప్రేక్షకుల మన్నను పొందాడు. కాక పోతే ఈ చిత్రంలో గొంతులో గంభీర్యం, రౌద్రం ప్రదర్శించడం అంతా సక్సస్ కాలేదు. ఓవర్ఆల్ గా ఆయన నటన ఆకట్టుకుంది. అన్నింటినీ మించి ఈ చిత్రంలో ఆలోచింపచేసే అంశం ఒకటుంది. అదేమిటంటే...
 
ఏ సంఘంలోనైతే ఆడది తన కడుపు నింపుకోవడానికి పైన కింద ఉన్న అవయవాలను అమ్ముకోవలసి వస్తుందో .. ఆ సంఘంలోని మగవారంతా నపుంసకులే....... ఇది నిజమే కదా





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: