కొరటాల కు ఆదేశాలు జారీ చేసిన యంగ్ టైగర్....!!
ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని..
వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సినిమా ఎలాగూ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నాం కనుక వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి వరకు షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేయాలని దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. హిందీలో వార్ 2 సినిమా ను చేసేందుకు ఎన్టీఆర్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ సినిమా ను త్వరగా పూర్తి చేయాలని కొరటాల శివకి కాస్త సీరియస్ గానే ఎన్టీఆర్ చెప్పాడట. రాజమౌళి మాదిరిగా సంవత్సరాలకు సంవత్సరాలు లాగుతానంటే మాత్రం కచ్చితంగా ఊరుకోను.. సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు పూర్తి చేయాల్సిందే అంటూ కాస్త గట్టిగానే కొరటాల శివతో ఎన్టీఆర్ చెప్పాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ దిశగానే దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించారని, కచ్చితంగా ఆ లోపే సినిమాను పూర్తి చేసే విధంగా షూటింగ్ జరుపుతాడని అంతా భావిస్తున్నారు.