అతి సహజత్వమే తంగలాన్ కొంపముంచిందా..?

murali krishna
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేయగా నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ సాంకేతిక విలువలతో నిర్మించారు.“తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది.
రొటిన్‌ కమర్షియల్‌ ఫార్ములా సినిమాలకు కాలం చెల్లింది. వైవిధ్యమైన సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇదే కోవలో పూర్తి వైవిధ్యమైన నేపథ్యాన్ని, కథను ఎంచుకుని వచ్చిన చిత్రమే తంగలాన్‌.సాధారణంగా విక్రమ్‌ అనగనే విభిన్నమైన సినిమాతో పాటు అందులో అతని సరికొత్త గెటప్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంటారు ప్రేక్షకులు. ఆయన గత సినిమాల్లో పోషించిన పాత్రలే అందుకు కారణం.ఇక తంగలాన్‌ చిత్రంలో కూడా ఓ గిరిజన తెగ నాయకుడిగా… అత్యంత సహజమైన మేకప్‌తో, అచ్చం ఆదివాసి మనిషిలా కనిపించాడు విక్రమ్‌.

తంగలాన్‌కు పోటీగా విడుదలైన సినిమాలు మిస్టర్‌ బచ్చన్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాలకు నెగెటివ్‌ టాక్‌ రావడంతో.. తంగలాన్‌ వాటి మీద బెటర్‌గా వుందని.. సినిమా రా రస్టిక్‌ ఫిల్మ్‌గా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ నేపథ్యంలో కొనసాగే ఈ కథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సహజత్వం కోసం దర్శకుడు ఎలాంటి కమర్షియల్‌ హంగులను యాడ్‌ చేయలేదు. కథ, కథనాలు చాలా నెమ్మదిగా కొనసాగాయి. సినిమా ప్రారంభం ఇంట్రెస్టింగ్‌గా మొదలైన… రాను రాను కాస్త బోరింగ్‌గా మారుతుంది. ఇందుకు స్క్రీన్‌ప్లేను దర్శకుడు బలంగా రాసుకోకపోవడమే. ఇక సెకండాఫ్‌లో కథ మరింత నెమ్మదించింది.గోల్డ్‌ ఫీల్డ్‌ తవ్వకాలు, వాటిని పర్యవసానాల సన్నివేశాలను మరింత బిగువుగా లేకపోవడం వల్ల ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తిగ అనిపించదు. సినిమాలో వున్న అత సహజత్వం వల్ల అప్పుడప్పుడు డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. ఇక పతాక సన్నివేశాలు కూడా హడావుడిగా ముగించడమే ఈ చిత్రానికి మరో పెద్ద మైనస్‌. దర్శకుడు కీలక సన్నివేశాలను మరింత రక్తికట్టించనట్లయితే తప్పకుండా తంగలాన్‌ అందరి సినిమాగా వుండేది.బంగారం తవ్వడం కోసం ఊరు ఊరంతా రావడం, ఆయా సన్నివేశాలు సాగదీత వ్యవహారమే. అయితే, క్లైమాక్స్ థ్రిల్ ఇస్తుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ బావున్నాయి. ఆ పాటలు కథలో భాగంగా వెళ్లాయి. వినడానికి బావున్నాయి. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఖర్చుకు వెనుకాడలేదు. టెక్నికల్ పరంగా, విజువుల్‌గా సినిమా బావుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: