మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. దానితో సుకుమార్ ఈ సినిమాకు దగ్గరుండి ఆ సమయానికి సంబంధించిన సెట్టింగ్స్ ను వేయించాడు.
ఇక ఈ సినిమాలోని సెట్టింగ్స్ అన్నీ కూడా 1980 బ్యాక్ డ్రాప్ కు సరిపోయేలా ఉండడంతో ఈ సినిమాలోని సెట్టింగ్ లకి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇకపోతే ఈ సినిమా కూడా ఓల్డ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగనున్నట్లు తెలుస్తోంది. దానితో బుచ్చిబాబు "రంగస్థలం" సినిమాకు మించిన స్థాయిలో ఈ సినిమా సెట్టింగ్ లను దగ్గరుండి వేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని సెట్టింగ్ లకే ఏకంగా 80 కోట్ల వరకు ఖర్చు కానునట్లు తెలుస్తుంది. అలా బుచ్చిబాబు , చరణ్ సినిమా కోసం సెట్టింగ్ లకి భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.