దేవర : తారక్ ఆచార్య రిజల్ట్ చూసి అయినా దండం పెట్టి ఉండాల్సింది కదా..!
`ఆచార్య`లో పాదగట్టం, `దేవర`లో ఎర్రసముద్రం అంతే తేడా అనేలా ఉంది. కొరటాల గత చిత్రాల మార్క్ చూపించలేకపోయాడు. హీరోయిజానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో అసలు కథ పలుచనైపోయింది. పైగా ఊహించేలా స్క్రీన్ ప్లే ఉండటం పెద్ద మైనస్. బాహుబలిని గుర్తు చేసేలా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కు లీడ్ వదిలిన విధానం బాగుంది. కానీ అందులోనే హింట్ ఇచ్చాడు. ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ట్విస్ట్ ఉండటంతో అసలు లీక్‌ని దర్శకుడే ఇచ్చాడనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా తేలిపోయిందనే చెప్పాలి.ఈ నేపథ్యంలో ఆచార్య డిజాస్టర్ చూసిన తర్వాత అయినా ఎన్టీఆర్ కొరటాల శివను ఎంచుకోకపోయివుంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.అలాగే కొరటాల డిజైన్ చేసిన సీన్స్ అనిరుథ్ ఎలివేట్ చేశాడు. కానీ కథలో బలం లేకపోవడం వల్ల ఏం చేసినా అది చప్పగానే మారిపోయింది. పాటల్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్. కొరటాల డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పదేముంది. మిగతా క్రాప్ట్ కూడా సినిమాకు బాగా కలిసొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంది. కానీ దానికి కథ, స్క్రీన్ ప్లే కూడా బలంగా ఉంటే సినిమా బాగుండేది. కానీ కొరటాల తన మార్క్ ని మిస్ అయ్యాడు.దేవర...ఎన్టీఆర్ సినిమాగా ఓ మెట్టు పైనే ఉంది. అయితే ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి చూస్తే కథలో పెద్దగా ట్విస్ట్ లు కనిపించవు, కొన్ని చోట్ల పాత సీన్స్ తో , రొటీన్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ అయితే మరీను.. అయితే ఓవరాల్ గా చూస్తే ఫర్వాలేదు. కానీ ఎన్టీఆర్ రేంజ్ మూవీ అనిపించుకోదు.