గేమ్ ఛేంజర్ ఇంటర్వెల్ ట్విస్ట్ అన్ ప్రెడిక్టబుల్.. శంకర్ మ్యాజిక్ చేశారుగా!
అయితే కధ పరంగా ఈ సినిమా అనేది రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఫస్ట్ హాఫ్ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో శంకర్ తన స్టైల్ లో అవినీతి అధికారులు, వ్యాపారవేత్తల గురించి చూపించారు.ఫస్ట్ హాఫ్ లో రాంచరణ్, ఎస్ జె సూర్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంజలి పాత్ర పరిచయం కాగానే ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది. పెళ్లి బట్టలు గెటప్ లో పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండ్ హాఫ్ పై అంచానాలు పెంచేలా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబౌ యావరేజ్ స్టఫ్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ కాలేదు.ఇక సెకండ్ హాఫ్ లో తొలి ఇరవై నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.ఇరవై నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తెరకెక్కించిన విధానం అద్భుతం.సినిమా మొత్తాన్ని రాంచరణ్ తన భుజాలపై మోయగా ఎస్ జె సూర్య సహకారం అందించారు. తమన్ బిజియం కూడా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది.