game changer review: బెన్ ఫిట్ షోతో మొదలైన పబ్లిక్ టాక్.. ఎలా ఉందంటే.?

FARMANULLA SHAIK
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఏపీలో ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బెనిఫిట్ షోలు పడ్డాయి‌. అమెరికాలోనూ ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. తమిళనాడు కొంతమంది క్రిటిక్స్ కోసం ప్రత్యేకంగా షోస్ వేసినట్లు తెలిసింది. ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి సోషల్ మీడియా టాక్ ఎలా ఉంది?  అనేది చూస్తేగేమ్ చేంజర్' సినిమా మీద ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ చూస్తుంటే వాళ్ళు అందరినీ సినిమా అమితంగా ఆకట్టుకుందని అర్థమవుతుంది. మరో వైపు ఓవర్ సీస్ రిపోర్టులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్, ఎస్.జె. సూర్య నటన పట్ల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలావుండగా గేమ్ ఛేంజర్ గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఇది ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు.. కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని..! తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ కు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథకు తనదైన శైలిలో చాలా మెరుగులు దిద్దాడు అని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది.

గేమ్ చేంజర్ లో మేజర్ హైలైట్ పాటలు, గ్రాండియర్. మొదలైన 20 నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్లిపోయాడు శంకర్. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలు పెట్టాడు. టిపికల్ శంకర్ లో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ లో కూడా చాలానే ఉన్నాయి. దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు శంకర్. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అద్వాని, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి.ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోయింది. అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంది. ముఖ్యంగా చరణ్, ఎస్ జె సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తన లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషనల్ గా వర్కౌట్ చేయడం శంకర్ అలవాటు. గేమ్ ఛేంజర్ లోనూ ఇదే చేశాడు శంకర్. అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడ ముగించాడు దర్శకుడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ మెయిన్ స్టోరీలోకి వచ్చేసాడు శంకర్. చరణ్, సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ ట్యాట్ ఎపిసోడ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది.మొత్తంగా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఐఎఎస్ రామ్ నందన్ గా.. అటు అప్పన్నగా రెండు పాత్రల్లోనూ చాలా బాగా నటించాడు చరణ్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు మెగా వారసుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: