సైజ్ జీరోలో రాజమౌలి పాత్ర..!!

shami
అనుష్క లీడ్ రోల్ చేసిన సినిమా సైజ్ జీరో.. కొద్దిగంటలలో ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌలి ఈ సినిమాలో పాత్ర పోషించాడట. పాత్ర అంటే సినిమాలో నటించాడని మీరు అనుకోవచ్చు ఎబ్బే అదేం కాదండి.. తన గురువు రాఘవేద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రాఘవేంద్ర రావు సలహా మేరకు సినిమా ఎడిటింగ్ కట్స్ కొన్ని చెప్పాడట రాజమౌలి.


సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక సినిమా చూసిన ప్రసాద్ వి పొట్లూరి సినిమా ఇంకా ట్రిం చేయాలని అభిప్రాయపడ్డాడట. అయితే ప్రకాశ్ కోరిక మేరకు సినిమాను జక్కన్న దగ్గరుండి కొన్ని కట్స్ చెప్పాడని అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ బాగా వచ్చాయని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి.


సైజ్ జీరోలో అనుష్క :


అనుష్క లీడ్ రోల్లో నటించిన సైజ్ జీరో తెలుగు తమిళ భాషల్లో నిర్మితమవుతుంది. కార్పోరేట్ దిగ్గజం పొట్లూరి వర ప్రసాద్ ఈ సినిమాను పివిపి బ్యానర్లో నిర్మించారు. రీసెంట్ గా రుద్రమదేవితో మంచి హిట్ కొట్టిన అనుష్క ఈ సినిమాతో కూడా మరో సంచలన విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు. సినిమా అంతా బాగున్నా రాజమౌలి హ్యాండ్ కూడా పడ్డది కాబట్టి సినిమా ప్రేక్షకులకు నచ్చే చాన్స్ ఉంది. ఆర్య, అనుష్కలతో పాటుగా సైజ్ జీరో సినిమాలో హాట్ గాళ్ సోనాల్ చౌహాన్ కూడా నటించింది.


కొద్దిగంటల తర్వాత దీని రిజల్ట్ ఏంటి అన్నది తెలుస్తుంది. సైజ్ జీరోలో లావు అమ్మయిలా కనిపించడం కోసం అనుష్క నిజంగానే లావెక్కడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సినిమా కోసం హీరోలకు ధీటుగా తను కూడా ఇలా బాడీని బిల్డ్ అప్ చేయడం చూసి అనుష్కకు హ్యాట్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. మరి ఇంత కష్టపడ్డ అనుష్క సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే జస్ట్ ఒక్క పూట ఆగితే చాలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: