సమంతకి షాకింగ్ ఇచ్చిన శ్రుతిహాసన్
కథా పరంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయటానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇక సమంత కోలీవుడ్ లో ఓ డీ గ్లామర్ ఉన్న కథాంశంలో లీడ్ రోల్ చేయనుంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ వర్క్ నడుస్తున్న ఆ చిత్రంలో సమంత ఓ మానసిక ఎదుగుదుల లేని 20 ఏళ్ళ మహిళ పాత్రలో కనిపించనుంది. ఇందుకోసం ఆ మూవీలో సమంత మేకప్ లేకుండా..విచిత్ర వేషాధారణతో కనిపిస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ అనుష్క మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటే, తాజాగా సమంత సైతం ఆ జాబితాలోకి చేరిపోయింది. దీంతో సమంత తో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటువంటి చిత్రాలకు సమంత భారీగానే రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది. మామూలు సినిమాకి కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ ని తీసుకుంటుంటే...ఈ తరహా చిత్రాలకి దాదాపు కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది.
సమంతకి డిమాండ్ పెరగటం ఇష్టంలేని శ్రుతిహాసన్ సైతం డీ గ్లామర్ పాత్రలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమంతకి ఝలక్ ఇచ్చింది. అందుకే తాజాగా హీరో నాగ చైతన్య నటించబోతున్న ప్రేమమ్ రీమేక్ లో శృతి హాసన్ ఓ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో లెక్చరర్ గా ఓ డీ గ్లామర్ లుక్ లో కనిపించనుంది. అలాగే మరో ప్రయోగాత్మక చిత్రానికి సైతం శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి దర్శకుడిగా బాల వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.