గణేష్ కు రెండు అవకాశాలు

Chowdary Sirisha
ఢమరుకం చిత్రంలో నటించిన గణేష్ వెంకటరామన్ కు విలన్ గా మంచి గుర్తింపే వచ్చింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన గణేష్ అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఢమరుకంతో ఏకంగా మనోడి దశే మారిపోయింది. ప్రస్తుతం ఓ రెండు చిత్రాలను అంగీకరించాడు. సిద్ధార్థ్, హన్సికలు నటిస్తున్న ఓ చిత్రంలో గణేష్ కు విలన్ వేషం దక్కింది. అలానే మరో తమిళ చిత్రంలోనూ ప్రతినాయక పాత్రలో కనిపించేందుకు సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ మూడు కథలు విన్నాడట. త్వరలోనే వాటినీ ఫైనలైజ్ చేసేస్తాను అని చెబుతున్నాడు. మొత్తానికి దక్షిణాదికి మరో మంచి విలన్ దొరికినట్టే అనుకుంటున్నారు సినీ పండితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: