ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోలేడట..!!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోనూ సూద్ ఒకరు. మంచి యనర్జిటిగ్గా హైట్ పర్సనాలిటీ ఉండటంతో ఏ హీరోతో అయినా పర్ఫెక్ట్ గా సరిపోతాడు. వాస్తవానికి బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సోనూ సూద్ మొదట మోడలింగ్ చేశారు. ఇక తెలుగు లో ‘అరుంధతి’ చిత్రంలో అఘోరాగా నటించి బొమ్మాలీ నిన్ను వదలా అంటూ డైలాగ్ తో మంచి గుర్తిపు పొందాడు.

తర్వాత వచ్చిన సినిమాలో విలన్ గా మంచి సక్సెస్ అయ్యాడు. తాజాగా సోనూ హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కుంగ్ ఫూ యోగా’ నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలోఉంది. ఈ ఏడాది చివరకల్లా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో జాకీ చాన్ కు సమానంగా సోనూ సూద్ పాత్ర ఉంటుందట. ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గనక మంచి సక్సెస్ సాధిస్తే మనోడి జాతకమే మారుతుందట.

బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా మంచి చాన్సులు వచ్చే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే.. ఈ సారి న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను జాకీచాన్ తో కలిసి జరుపుకున్నారు సోనూ సూద్. ఈ సందర్భంగా జాకీ చాన్ నుండి ఒక  జాకెట్ గిఫ్ట్ గా అందుకున్నారు. ఈ విషయాన్ని సోనూ సూద్ తన ట్విట్టర్లో ఫాన్స్ తో పంచుకున్నాడు. జాకీచేన్ ఇచ్చిన గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేనని అంటున్నాడు సోనూసూద్.


జాకీచాన్ తో సోనూ సూద్


సోనూ సూద్ ట్విట్స్ : 

N the New Year Begins with my bro 👬 #jackiechan ..thank u for this lovely jacket 👕 #Beijing #kungfuyoga pic.twitter.com/N6sGxiVUQk

— sonu sood (@SonuSood) January 2, 2016 Thank u dear. https://t.co/Pss7qmyEfJ

— sonu sood (@SonuSood) January 2, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: