5 కోట్ల రూపాయలకి చేరుకున్న చరణ్ స్నేహితుడు
దీంతో చాలా మంది నిర్మాతలు, దర్శకులు శర్వానంద్ కోసం క్యూ కడుతున్నారు. కానీ వరుస మూవీలకి శర్వానంద్ ఒప్పుకోవటం లేదు. కథ బాగా నచ్ఛితేనే చేసేందుకు రెడీ అంటున్నారు. అలాగే తన రెమ్యునరేషన్ ని సైతం భారీగా పెంచేశాడు. గతంలో కేవలం కోటి యాభైలక్షలు, లేదా రెండు కోట్ల రూపాయలతో సర్ధుకుపోయే శర్వానంద్…ఈ సారి మాత్రం ఏకంగా 5 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడంట.
శర్వానంద్ తన తదుపరి సినిమాని సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ సినిమా చేసిన పి. మహేష్ డైరెక్షన్ లో చేయనున్నాడు. మహేష్ ఈ సారి శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథని సిద్దం చేశాడు. ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీకే శర్వానంద్ బారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకూ తక్కువ రెమ్యునరేషన్ తో చేసుకుంటూ వచ్చిన శర్వానంద్; ఇక నుండి మాత్రం తక్కువ సినిమాలను చేస్తూ…తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్నాడు. అంతే కాకుండా తన సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ విషయంలో టాప్ హీరోయిన్స్ ఉండేగా ప్లాన్ చేసుకుంటున్నాడంట. వరుస సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించ వద్దు అంటూ శర్వానంద్ కి, మెగాహీరో రామ్ చరణ్ సలహా ఇచ్చాడంట.