గ్రూపులు నడపడంలో సమంత అంతర్యం !

Seetha Sailaja
సమంత కొద్దికాలంగా తన ట్విటర్ లో సందడి చేయకుండా ఉండటంతో ఆమె ఏమైపోయింది అంటూ ఆమె అభిమానులు టెన్షన్ పడ్డారు. తిరిగి సమంత మీడియాలో తన సందడి మొదలు పెట్టింది. అంతేకాదు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిమానుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. 

తన అభిమానులు చాల బుద్ధిమంతులు అని చెపుతూ ‘నా కెరియర్ ఇలా ఉండటానికి కారణం నా అభిమానులే, నేను ఏం చేసినా వాళ్లు ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. వాళ్ల సలహాలు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్నే కాదు’ అంటూ తన ఫ్యాన్స్ ను ఆకాశానికి ఎత్తేసింది సమంత. అంతేకాదు తన ఫ్యాన్స్ అందరి సెలెబ్రెటీల ఫ్యాన్స్ లా కాకుండా ఎదో ఒక వృత్తిలో   కొనసాగుతున్న ప్రొఫెషనల్స్ అంటూ కామెంట్స్ చేసింది.

అదే విధంగా తన అభిమానులు చాల బాధ్యతగా ఉంటూ తనతోపాటు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారని అందుకే తనకు తన అభిమానుల పై అంత ప్రేమ అంటూ కామెంట్స్ విసిరింది. మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే సమంత హైదరాబాద్ లో ఓ గ్రూప్ నీ,  చెన్నైలో ఓ గ్రూప్ నీ తన ఫ్యాన్స్ గా మెయిన్ టైన్ చేస్తోందట. సమంత కొత్తగా ఏం చేసినా వాళ్లకు సమాచారం ఇస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తుందట. 

అందుకే నిజంగా అలాంటి ఫ్యాన్స్ ఎంతమంది హీరోయిన్స్ కు ఉంటారు అని అడుగుతోంది సమంత. ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమంత లేటెస్ట్ గా మరో సంచలనం సృష్టించింది. 50 కేజీల బరువుతో నాజూకుగా ఉండే సమంత ఏకంగా 100 కేజీల బరువును తన జిమ్ లో తన ట్రైనర్ సమక్షంలో ఏకంగా 3 సార్లు ఎత్తి దానిని వీడియోతీసి యూట్యుబ్ లో పెట్టింది. ఈ వీడియో చూసిన వాళ్ళు అంతా సమంత సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: