రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ అంతా..?!

frame రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ అంతా..?!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం అమ్మ, అత్త లాంటి పాత్రల్లో నటిస్తుంది. అయితే గత కొంత కాలంగా రమ్యకృష్ణ కు అలాంటి పాత్రలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాలేదు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ పాత్రకు ఎక్కడలేని ఇమేజ్ వచ్చిపడింది. దీంతో రమ్యకృష్ణకు తెలుగు,తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది..అంతే కాదు విపరీతమైన డిమాండ్ కూడా పెరిగిపోయింది.

ఇక రీసెంట్ గా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో రమ్యకృష్ణ తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. సాధారణంగా రమ్య రూ.40లక్షల నుంచి రూ.80లక్షల దాకా తీసుకుంటుంది. తాజాగా ఆమె భర్త వంశీకృష్ణ కు చెందిన రుద్రాక్ష సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె ఇంతవరకు చేయని పాత్ర చేస్తోందని తెలుస్తోంది.

బాహుబలి చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ


ఈ చిత్రంలో రమ్య సైకాలజిస్టు పాత్రని చేస్తోందని అంటుంటే... మరికొందరు దెయ్యం పాత్ర అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ తన రెమ్యూనరేషన్ మాత్రం కోటిన్నర తీసుకుంటుందని టాలీవుడ్ టాక్. అలాగే సమంతా నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని  దిల్ రాజు  నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: