యూనివర్సల్ హీరో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘విశ్వరూపం’. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 11న ఆంధ్ర ప్రదేశ్ లో దాసరి నారాయణరావు గారి సిరి మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వేల్యూస్ తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు ఉంది’ అని తెలిపారు.
కమల్ హాసన్, ఆండ్రియా, పూజా కుమార్, శేఖర్ కపూర్, జరీనా వాహబ్, రాహుల్ బోస్, నాజర్, జైదీప్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సను జాన్ వార్గీస్, సంగీతం : శంకర్ ఎహ్ సాన్ రాయ్, మాటలు : వెన్నెలకంటి, పాటలు : రామ జోగయ్య శాస్ర్తి, ఎడిటింగ్ : మహేష్ నారాయణన్, రచన-దర్శకత్వం : కమల్ హాసన్.
మరింత సమాచారం తెలుసుకోండి: