కథని అలా చెప్పినందుకే రిజెక్ట్ చేశా: తమన్నా
తను ఒప్పుకోవాలే కాని, ప్రస్తుతం తన చేతిలో దాదాపు 4 చిత్రాల వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ కథలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కథని సైతం తమన్న ఒప్పుకోలేదు. ఇందుకు ఎన్నో కారణాలను తమన్న చెప్పుకొచ్చింది. అయితే తన దగ్గరకు వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ కథలలో ఎక్కువు భాగం సమాజంలో ఉన్న సమస్యలపై పోరాడే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ కథలలో ఎక్కువ ఏడుపు పాత్రలు ఉన్నాయంట.
అందుకే అటువంటి కథలని తను రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘‘తెరపై ఏడుపుని మాత్రం నేను భరించలేను. అటువంటి సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడను’’ అంటూ తమన్న చెప్పింది. తను అలా చెప్పటానికే కారణాలు ఇవే అని అంటున్నారు.
తనకి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించాలని ఉన్నప్పటికీ...తను మాత్రం ఏడుస్తూ చేసే పాత్రలకి మాత్రం దూరం అని అంటున్నారు. ఇకనైనా స్టార్ డైరెక్టర్స్, తమన్నతో ఇలాంటి ఏడుపు పాత్రలతో ఉన్న కథలని చెప్పకుండా ఉంటే మంచిదని అంటున్నారు. ప్రస్తుతం తమన్న తమిళ్ లో’ధర్మదురై’ సినిమాతో పాటు విశాల్ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. తమన్నా తెలుగులో ’అభినేత్రి’, ’బాహుబలి’ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.