లీక్ అయిన బ్రహ్మోత్సవం స్టోరీ షాక్ లో మహేష్ !

Seetha Sailaja
‘బ్రహ్మోత్సవం’ సినిమా కథ గురించి ఎటువంటి లీక్స్ ఇవ్వకుండా ఈసినిమా నిర్మాతలు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్న ఈసినిమాకు సంబంధించిన మూల కథ లీక్ అయింది అంటూ ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. లీక్ అయిన ఈసినిమా కథ ఎంత వరకు వాస్తవమో తెలియకపోయినా ఆ కథ మాత్రం ‘బ్రహ్మోత్సవంలోని పాత్రలకు సరిగ్గా సరిపోతోంది. ఈనెల 7వ తారీఖున విడుదల కానున్న ఈ సినిమా పాటల గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఈ సినిమా కథ ఇది అంటూ వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈసినిమా కథ ప్రకారం ఉమ్మ‌డి కుటుంబానికి చెందిన మ‌హేష్ ఫ్యామిలీ ఎలాంటి క‌ల‌త‌లు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్న తరుణంలో అనుకోకుండా మ‌హేష్ తండ్రి చ‌నిపోతాడు. ఆ తరువాత తండ్రి అస్తిక‌ల‌ను కాశీలో క‌లిపేందుకు బయలుదేరిన మ‌హేష్‌కు రైలులో హీరోయిన్ స‌మంత‌ ప‌రిచ‌యం అవుతుంది. అయితే సమంతకు తొలి చూపులోనే మహేష్ విపరీతంగా నచ్చేయడంతో ఆమె తనను పెళ్లి చేసుకోమ‌ని మహేష్ ను అడుగుతుంది. అయితే మహేష్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. 

దీనికి కారణం మహేష్ అప్పటికే త‌న తండ్రి స్నేహితుడి కుమార్తె, ఎన్నారై అయిన కాజ‌ల్‌ను ప్రేమించిన‌ట్టు సమంతకు చెపుతాడు.  కాశీ నుంచి వ‌చ్చాక మహేష్ స‌మంత జ్ఞాప‌కాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే మహేష్ తండ్రి చనిపోతూ తన మేన కోడలు ప్రణితను పెళ్ళి చేసుకోమని  మహేష్ ను కోరడంతో  తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మ‌ర‌ద‌లు ప్ర‌ణీత‌ను పెళ్లి చేసుకోవాలా ? లేదంటే తాను ప్రేమించిన కాజల్ ను పెళ్ళి చేసుకోవాలా ? లేకుంటే తనను ప్రేమించిన సమంత ను పెళ్ళి చేసుకోవాలా అన్న సందిగ్ధంలో వచ్చే ట్విస్ట్ లు చుట్టూ ‘బ్రహ్మోత్సవం’ కథ తిరుగుతుందని పుకార్లు హడావిడి చేస్తున్నాయి. 
 
ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాను ఎదో విధంగా పూర్తి చేసి మే 20న విడుదల చేయమని మహేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై విపరీతమైన ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే విడుదల ఆలస్యమైన ఈసినిమా విడుదల ఇంకా ఆలస్యం అయితే సమ్మర్ సీజన్ అంతా పూర్తి అయిపోయాక ఈ సినిమా విడుదల అయినా ప్రయోజనం ఏమి ఉంటుంది అనే అభిప్రాయంలో మహేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: