సమంత, తమన్నాతో నాగ చైతన్య

Prasad
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, నాగ చైతన్య కలయికలో ఒక సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం కోసం కథ ఇప్పటికే సిద్ధమైయ్యింది. నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించగా సూపర్ హిట్టయ్యిన ‘హాలో బ్రదర్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది. అయితే దర్శకుడు ఈ వార్తలను అంగీకరించడం లేదు. ‘హాలో బ్రదర్’ ఆధారంగానే తమ సినిమా తెరకెక్కుతుందని, అయితే అదే కథతో మాత్రంతో కాదని శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. అలాగే ఈ సినిమాలో సమంత, తమన్నాలు ఈ సినిమాలో జోడీగా నటించనున్నారు. ఇంకా విషయాన్ని ధృవీకరించలేదు. నాగార్జునతో అనేక సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన కామాక్షి మూవీస్ ఈ కొత్త సినిమా ను రూపొందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: