చరణ్ కి షాక్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్
ఇప్పటి వరకూ చిరంజీవి సాంగ్స్ ని ఎక్కువుగా రీమిక్స్ చేసిన హీరో ఎవరు అంటే ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రమే. అయితే తాజగా సాయిధరమ్ తేజ్, చిరంజీవి నటంచిన గ్యాంగ్ లీడర్ మూవీలోని సాంగ్స్ ని రీమిక్స్ చేయాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పగా…ఆ ఒక్కసినిమాని చరణ్ కోసం కోసం ఉంచరా…అని సరదాగా అన్నాడంట. దీంతో గ్యాంగ్ లీడర్ సినిమా ఎప్పటికైనా చరణ్ రిమేక్ చేస్తాడు అని చిరంజీవి భావిస్తున్నాడు.
కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం చిరంజీవి అన్నీ హిట్ సాంగ్స్ ని తను తన మూవీల్లో రీమిక్స్ కింద వాడుకోవాలని చూస్తున్నాడు. ఏదొక విధంగా తన మూవీ విజయం కోసం చిరంజీవి సాంగ్స్ ని రీమిక్స్ చేయటంలో తప్పులేదని ధరమ్ తేజ్ అభిప్రాయంగా ఉంది. ఇక గ్యాంగ్ లీడర్ పై సాయిధరమ్ తేజ్ కన్ను పడిందనే విషయం తెలిసేసరికి…రామ్ చరణ్ షాక్ అయ్యాడు.
చిరంజీవి చెప్పాడు కాబట్టి ఆగాడు కానీ, ఆ మూవీలో హిట్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్ ని…ఇప్పటికే సాయిధరమ్ రీమిక్స్ చేసేవాడు అనేది చరణ్ అభిప్రాయం అంట. తండ్రి పాటలను చెడగొట్టకుడదని కొడుకు ఆలోచిస్తుంటే..మేనల్లుడు మాత్రం మామ పాటలను ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.