కార్తి కూడా ట్విట్టర్ లో అడుగెట్టాశాడు..!

shami
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అంతే సిని తారలకు అదో సరదా.. అయితే ఎంతోమంది తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటిలో మెమరీస్ ను షేర్ చేసుకుంటున్నారు. వారి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందులో డైరెక్ట్ గా వారి ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది.


అయితే ఈ క్రమంలో బర్త్ డే బోయ్ కార్తి కూడా ఈరోజు ట్విట్టర్లో ప్రవేశించడం విశేషం. తమిళ హీరో అయినా తెలుగులో తన అన్న లానే మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కార్తి రీసెంట్ గా ఊపిరి హిట్ తో మరింత క్రేజ్ సంపాదించాడు. తను నటించే సినిమాల్లో సరదాగా ఉండే పాత్రకే ఎప్పుడు సహజత్వంతో నటించే కార్తి తన అభిమానులకు మరింత చేరువగా ఉండేలా ట్విట్టర్ లోకి వచ్చారు.


Stepping into a new world and new experience. Thank you all for making me feel so loved!

— Actor Karthi (@Karthi_Offl) May 25, 2016
కొత్త ప్రపంచం.. కొత్త ఎక్స్ ప్రీరియన్స్ తనను అభిమానిస్తున్న అభిమానులందరికి థాంక్స్ అంటూ మొదటి ట్వీట్ చేశాడు కార్తి. ఊపిరి హిట్ తో తెలుగు డైరెక్ట్ సినిమా కూడా చేయగల సత్తా తనకుందని చాటి చెప్పిన కార్తి ఇక కేవలం తెలుగు సినిమాలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో కాష్మోరా సినిమా చేస్తున్న కార్తి త్వరలో ఆ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


ఇక సింగం-3 లో కార్తి కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి స్క్రీన్ మీద అన్నదమ్ములు ఒకేసారి కనిపిస్తే అది నిజంగా వారి అభిమానులకు పండుగ అన్నట్టే. ఇక తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించిన కార్తి మరిన్ని తెలుగు సినిమాలు కూడా తీయాలని కోరుకుంటున్నారు ఇక్కడి అభిమానులు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: