ఎన్టీఆర్ 10 అపురూప చిత్రాలు..!

Edari Rama Krishna
తెలుగువారు ఎంతో అభిమానంగా పిలుచుకున్న పదం ‘అన్నగారు’. ఈ పదానికి వన్నెతెచ్చిన మహాను భావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రపరిశ్రమలో నటసార్వభౌములుగా వెలిగిపోయిన ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పారు. అప్పటి వరకు కాంగ్రెస్ హస్తగతమైన తెలుగు రాష్ట్రంలో తెలుగు వారికి జరిగిన అవమానానికి బదులు చెప్పేందుకు ఏకంగా ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పై అఖండ విజయం సాధించి తెలుగోడి సత్తాఏమిటో చూపించారు.

ఎన్టీఆర్  తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో అద్భుతమైన పది చిత్రాలు..ఒక్కసారి చూద్దామా.


1) పెళ్లి చేసి చూడు (1952) :


ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద 175 రోజులు ఆడింది.  ఈ చిత్రంలో  ఎన్టీఆర్ ఎంతో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. ఈ  సినిమా ఏకకాలంలో తమిళంలో చేసిన మరియు కూడా టైటిల్ 'షాదీ కే బాద్' కింద హిందీ లో విడుదల వచ్చింది.


2) మిస్సమ్మ (1955) :


విజయా బ్యానర్ పై తీసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ నిరుద్యోగిగా ఉంటూ తన అవసరం కోసం సావిత్రి సహాయం తీసుకొని ఎస్వీరంగారావు ఇంటికి భార్యాభర్తలుగా వెళ్తారు. అక్కడ జరిగే సన్నివేశాలు చూస్తుంటే నిజంగా ఈ చిత్రం ఎంతో నిండు తనంతో కనిపిస్తుంది. అంతే కాదు ఈ చిత్రంలోని పాటు కూడా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. 


3) మాయాబజార్ (1957) :


ఈ చిత్రం చలన చిత్ర రంగంలోనే పెద్ద పెనుమార్పులు తీసుకు వచ్చింది. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడారు. మహాభారతంలో కొన్ని సంఘటనలు తీసుకొని అద్భుతమైన హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఈ చిత్రం ఒక్కొక్కరూ పది సార్లూ చూశారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్,ఎస్వీరంగారావు, సావిత్ర పోటీ పడి నటించారట. 


4) గుండమ్మకథ (1962) :


గుండమ్మకథ అనగానే మంచి కుటుంబ కథ నేపథ్యంలో సాగుతుంది. పొగరుబోతుగా ఉన్న గుండమ్మ పొగరు అణచడానికి ఇద్దరు అన్నదమ్ములు (ఎన్టీఆర్, ఏఎన్ఆర్) నడిపించే నాటకమే ఈ చిత్రం. సావిత్రి, జమున,సూర్యాంతం ఈ చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించారు. ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. 


5) రక్త సంబంధం (1962) :


ఈ చిత్రం మొదట అక్కినేని నాగేశ్వరరావు చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో ఆ చిత్రం ఎన్టీఆర్ చేశారు. ఈ చిత్రం ఆద్యంతం కన్నీరు పెట్టించే విధంగా అన్నాచెల్లెలి అనుబంధం గురించి ఉంటుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తమిళంలో శివాజీ గణేషన్ నటించారు.


6) నర్తనశాల (1963) : 


తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఓ ప్రయోగాత్మక చిత్రం చేశారు..అదే నర్తనశాల. ఈ చిత్రంలో ఆయన బృహన్నలగా నటించారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఎస్.వి.రంగారావు ఉత్తమ నటుడు గా, ఉత్తమ కళాదర్శకునికి రెండు బహుమతులు గెలుచుకొంది.


7) బడిపంతులు (1972) : 


 1972 లో విడుదలైన ఒక తెలుగు చిత్రము.జెమినీ గణేశన్ నటించిన ఒక తమిళ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది. ఇదే తరహా కథ తొ అమితాబ్ బచ్చన్,హేమమాలిని తో 'బాగ్ బన్' చిత్రం ఇటీవలే హిందీ లో నిర్మించబడింది. మద్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చిత్రంలో కొడుకులు తల్లిదండ్రులను పంచుకుంటారు. ఎన్నో బాధలు పడుతున్న వీరిని ఆయన దగ్గర చదువుకున్న పోలీసు అధికారి (జగ్గయ్య) కలుస్తాడు. అతడు మాస్టారి సాయంతో చదువుకున్న విద్యార్థి. మాస్టారి పాత ఇల్లు తిరిగికొని వారికి బహూకరిస్తాడు. కన్నబిడ్డలకన్నా, సాయం పొందిన బైటవారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది చిత్రకథ.


8) నిప్పులాంటి మనిషి (1974) : 


ఇది 1974లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం' జంజీర్' ఆధారంగా నిర్మితమయ్యింది. అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజి తీసుకువచ్చిన జంజీర్, రామారావు రెండవ ఇన్నింగ్స్ కు మార్గం సుగమం చేసింది.   ప్రాణ్ పాత్ర (షేర్ ఖాన్) సత్యనారాయణకు మంచి పేరు తెచ్చింది. మన్నాడె పాట 'యారి హై ఈమాన్ మెరి' తెలుగులో స్నేహమే నా జీవీతంగా వచ్చి హిట్ పాటగా నిలిచింది.


9) దానవీర శూరకర్ణ (1974) : 


పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం దానవీరశూరకర్ణ .  ఎన్టీఆర్ ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. 


10) యమగోల(1977) : 


ఎన్టీఆర్ కమర్షియల్ చిత్రాలో యమగోల ఒకటి. ఈ చిత్రం ఫాంటసీ తరహాలో ఉంటుంది. ఎన్టీఆర్ చనిపోయి నరకలోకానికి వెళ్లడం..అక్కడ యుముడు (సత్యనారాయణ) చిత్రగుప్తుడు (అల్లు రామలింగయ్య) లతో ఆడిన ఆట..పాట కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రంలోపి పాటు కూడా చాలా హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రం స్ఫూర్తితో ఇప్పటికీ కొన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. 


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: