సిద్ధమైన కల్యాణ రామ్ ‘ఓం’

Chowdary Sirisha
కాస్త విరామం తరువాత కల్యాణ్ రామ్ ‘ఓం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రయోగాలంటే ఇష్టపడే కల్యాణ్ రామ్ ఈ సారి ఈ చిత్రాన్ని పూర్తిగా త్రీడీలో నిర్మించాడు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి గత ఏడాదే వార్తలు వెలువడ్డాయి. విడుదల కూడా కొన్ని నెలల కిందనే అనుకున్నారు. అయితే, హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకొచ్చి సినిమాకి త్రీడీ హంగులు దిద్దడం వల్ల కాస్త ఆలస్యమైంది అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సునీల్ రెడ్డి. ఈ సంవత్సరం త్రీడీల్లో కొన్ని తెలుగు సినిమాలు రూపొందుతున్నా ముందుగా విడుదలయ్యే చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఆడియో విడుదల, చిత్రం విడుదల తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: