చిరంజీవి ‘కత్తిలాంటోడు’ వర్కింగ్ స్టిల్స్ హల్ చల్ ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి గత పది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. హీరోగా మంచి ఫామ్ లో ఉండగా శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో చివరిసారిగా నటించి తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. తర్వాత ఈయన వారసులుగా అరడజను మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఎలుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజించిన తర్వాత మెగాస్టార్ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన 150 వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆలితో ముచ్చటిస్తున్న చిరంజీవి


అయితే ఈ చిత్రం రెండు సంవత్సాలుగా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చిందనిపించుకున్నారు. అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా వర్కింగ్ స్టిల్స్ అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూహూర్తం కూడా జరిగిపోయింది. అయితే షూటింగ్ ఎప్పుడా అన్న సందేహాలు చాలా మందిని కంగారు పెట్టాయి. అంతే కాదు కొంత మంది అసలు ఈ చిత్రం లేనే లేదు అందు గ్యాస్ అన్నవారు కూడా ఉన్నారు.

వివివినాయక్ ని ఆలింగనం చేసుకున్న మెగాస్టార్


సఇకఅన్నింటికీ సమాదానం చెబుతూ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా వర్కింగ్ స్టిల్స్ అప్పుడే నెట్ లో సందడి చేయడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్, దర్శకుడు వి.వి. వినాయక్ తదితరులు ముచ్చట్లతో, ఆలింగనాలతో ఈ ఫోటోలు విపరీతంగా అలరిస్తున్నాయి. అంతే కాదు ఈ చిత్రంలో చిరంజీవి టీ షర్ట్ ధరించి కాస్త యంగ్ గా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: