‘మీర్జ్యా’ ట్రైలర్ అదిరిపోయింది..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో వారసులు హవా బాగా పెరిగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో హీరోలు తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. ఇందులో కలిసి వచ్చిన వారు ఇండస్ట్రీలో సెటిల్ కాగా కొంతమంది మాత్రం నామ మాత్రంగానే మిగిలిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ లో అనీల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ హీరోగా రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ‘మీర్జ్యా’ ట్రైలర్ విడుదల అయ్యింది. ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా తాజాగా అనీల్ కపూర్ తనయుడు హర్షవర్థన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. మూడున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని అంశాలను చూపించాడు డైరెక్టర్. ఫైనల్‌లో వార్ సీన్స్‌ని కూడా చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్ కాకుండా చాలా పార్ట్ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరిగింది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయిధరమ్ తేజ్ రేయ్ చిత్రంలోని హీరోయిన్ చాలా హాట్ హాట్ గా కనిపిస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈ ట్రైలర్ లో బాగానే చూపించారు. రెండుమూడేళ్లకొక సినిమాని తెరకెక్కించే డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాశ్‌మెహ్రా ఖాతాలో ఎన్నో బ్లాక్‌బస్టర్ వున్నాయి. దీంతో ఈ ఫిల్మ్‌పై ఇండస్ర్టీ‌లో అంచనాలు రెట్టింపయ్యాయి. అంతా అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 7న రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర యూనిట్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: