నాగార్జున ముందుగానే ఫిక్స్ చేశాడు
‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయానా’, ‘ఊపిరి’ లాంటి వరుస విజయాలతో ఏ హీరోకి సొంతం కాని ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నాడు. రామ్ చరణ్, బాలయ్య, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలు సైతం ఈ మధ్య కాలంలో నాగార్జున కి వచ్చినంత సక్సెస్ రేటుని అందుకోలేకపోయారు.
ఒక రకంగా చెప్పాంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరు అంటే అది నాగార్జున అనే చెప్పాలి. ఇదిలా ఉంటే, నాగార్జున, దర్శకుడు రాఘవేంద్ర రావుతో ప్రస్తుతం ఓ మూవీకి పని చేస్తున్నారు. జూన్ 25న ముహూర్తం షాట్ ని ఈ సినిమా కి ఫిక్స్ చేశారు. నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్లో గతంలో వచ్చిన భక్తి చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇప్పుడు అదే విధంగా వీరి కాంబినేషన్ లో వస్తున్న మరో ఆధ్యాత్మిక చిత్రం హాతీ రామ్ బాబా జీవిత కథతో తెరకెక్కనుంది.
దీనికి ‘ఓం నమో వెంకటేశాయ’ అన్న పేరును ఫిక్స్ చేశారు. నాగార్జున ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన లుక్స్ ని ఇప్పటికే మెయింటెన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి‘ఓం నమో వెంకటేశాయ’ అనే పేరుని దాదాపు రెండు నెలల క్రితమే నాగార్జున ఫిక్స్ చేశారని అంటున్నారు. కానీ ఈ విషయం మాత్రం బయటకు రాకుండా అటు రాఘవేంద్రరావు, ఇటు నాగార్జున ఇద్దరూ జాగ్రత్తపడ్డారని ఇండస్ట్రీ నుండి వినిస్తున్న టాక్స్. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.