బన్ని కన్ను ఆమెపై పడ్డదా..!

shami
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సమ్మర్లో సరైనోడు అంటూ వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు కావొస్తున్నా బన్ని తర్వాత సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. తమిళ తెలుగు దర్శకుల్లో నలిగిపోతున్న అల్లు అర్జున్ ఫైనల్ గా హరీష్ శంకర్ కు ఓటేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్రం పూజా హెద్గేనే పెట్టాలని అల్లు డిసైడ్ అయ్యాడట.


మోడలింగ్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె తమిళ మాస్క్ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత ముకుంద సినిమాతో తెలుగులో పరిచయమైన ఈ అమ్మడు నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసంలో యూత్ కి బాగా దగ్గరైంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే పూజా రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకుంది.


అయితే బాలీవుడ్ లక్కీ ఆఫర్ మొహెంజాదరో సినిమాలో ఛాన్స్ రావడంతో ఇక్కడ సినిమాలు కాదని బీ టౌన్ వెళ్లింది. హృతిక్ తో శృంగార సన్నివేశాళ్లో కూడా రెచ్చిపోయిన పూజా రాణి పాత్రలో అదరహో అనిపించింది. రిలీజ్ అయిన ట్రైలర్ హృతిక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ బ్యూటీని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బన్ని.


కథ దర్శకులే కాదు తనతో నటించే ఆర్టిస్ట్ సెలక్షన్స్ లో కూడా బన్ని చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే వరుసగా మూడు సినిమాలతో 50 కోట్ల కలక్షన్స్ ను ఈజీగా క్రాస్ చేశాడు. మరి బన్ని మనసు దోచుకున్న పూజా టాలీవుడ్లో మళ్లీ ఈ సినిమాతో  లక్ తగలనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: