పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
అయితే తనకి పక్కా డేట్స్ ఇచ్చే హీరో పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ అప్రోచ్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే డైరెక్టర్ ఎస్.జె.సూర్య మూవీకి కమిట్ అయ్యాడు. ఆ తరువాత సూర్య డైరెక్టర్ గా తప్పుకుని బాబి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, బాబి మూవీ తరువాత కచ్ఛితంగా త్రివిక్రమ్ తో కలిసి మూవీ చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.
అందుకు త్రివిక్రమ్ సైతం కమిట్ అయ్యాడు. కానీ తరువాత ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని సైతం త్రివిక్రమ్ చేసే మూడ్ లో లేడు. ప్రస్తుతం చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథని రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. చిరంజీవి 150వ సినిమా సెట్స్ పై ఉండగానే, తన నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ అంటూ మార్కెట్ లో టాక్స్ వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో చిరంజీవితో త్రివిక్రమ్ రెండు సార్లు కలిసి కథకి సంబంధించిన లైన్ ని ఫైనలైజ్ చేసుకున్నారంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి మూవీని త్రివిక్రమ్ ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ తో ఇప్పట్లో మూవీ లేనట్టే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కాస్త షాక్ అయ్యాడని అంటున్నారు.