ప్రభుదేవనే పరేషాన్ చేసిన తమన్నా..!

Edari Rama Krishna
తెలుగు,తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన తర్వాత దర్శకుడి అవతారం ఎత్తాడు. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు తీయగా అందులో కొన్ని విజయవంతం కాగా కొన్ని అపజయం పొందాయి. ఏది ఏమైనా  ఒకవైపు డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడి గా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశాడు ప్రభుదేవ. ఇక తెలుగు లో హ్యాపీడేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా తర్వాత అగ్రహీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించింది. గత సంవత్సరం జక్కన తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో దేవకన్యాల కనిపించి అందరి మనసు కొల్లగొట్టింది. దీంతో తమన్నా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక తమన్న మంచి నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ గా కూడా ఇప్పటికే ప్రూఫ్ చేసుకుంది. తాజాగా తన లేటెస్ట్ మూవీ కోసం ఈ అమ్మడు వీర లెవెల్లో ప్రాక్టీసు చేస్తోంది. సోనూసూద్-ప్రభుదేవాలతో తమన్న ఓ సినిమాలో నటిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలోని ఓ పాట కోసం విపరీతమైన ప్రాక్టీస్ చేసిందట.

అయితే  ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో లింక్ ను తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.. అయితే  వీడియో లో తమన్న చేస్తున్న డ్యాన్స్ చూసి ప్రభుదేవ షాక్ తిన్నాడట. ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో వస్తున్న ‘అభినేత్రి’ తమన్న ఓ నటీమణిగా నటించబోతుందట.  జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, రచయిత కోన వెంకట్ స్టోరీని అందిస్తున్నాడు. 

తమన్నా ట్విట్ :

Rehearsals with the best @PDdancing and @pareshshirodkar #stilllearning @devitamilmovie @AbhinetriMovie #trilingual pic.twitter.com/V7FjU93qyP

— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 2, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: