షాకింగ్ సర్ ఫ్రైజ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
ఇదిలా ఉంటే జనతా గ్యారేజ్ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించటం గ్యారెంటీ అని అంటున్నారు. అందుకే జనతా గ్యారేజ్ మూవీ ఆడియో ఫంక్షన్ విషయంలో అభిమానులకి జూనియర్ సర్ ప్రైజ్ ని ఇవ్వాలని భావించాడంట. అందులోని భాగంగానే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని మూడు ప్రధాన సెంటర్లో నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా హైదరాబాద్ లో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని చేస్తుండగా, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ని పెద్ద పెద్ద ఆడిటోరియంలలో ప్రత్యక్ష ప్రసారాలను ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ అభిమానులు...తెగ సంతోషపడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇది అభిమానులకి ఇచ్చిన సర్ ప్రైజ్ అని వారు అంటున్నారు. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం పై చిత్రయూనిట్ లోనూ పుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డం, డ్రెస్సింగ్ లతో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.