నాగార్జున కంటే బెటర్ నిర్ణయం తీసుకున్న కొడుకు
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగాచైతన్య తన అప్ కమింగ్ మూవీల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ వంటి మంచి చిత్రాలు ఇప్పుడు నాగచైతన్య చేతిలో ఉన్నాయి. ఆ తరువాత నాగచైతన్య, రానా తో కలిసి ఓ మూవీలో చేయనున్నాడనే విషయం తెలిసిందే.
అయితే ఇది నాగాచైతన్య తీసుకున్న సొంత నిర్ణయంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాంబినేషన్ కి సంబంధించిన దానిపై ఇంకొంత మాట్లాడిన నాగార్జున...నాగచైతన్య తన కంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ కాంబినేషన్ ని నేను అస్సలు ఊహించలేదు. కచ్ఛితంగా ఈ కాంబినేషన్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ అవుతుందని చెప్పుకొచ్చారంట.
దీంతో త్వరలోనే నాగచైతన్య, రానా కాంబినేషన్ లో మూవీ రానున్నదనేది స్పష్టం అయింది. ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా స్పష్టం కాలేదు. నిర్మాతగా సురేష్ బాబు ఉంటున్నారు. మొత్తంగా నాగచైతన్య తన అప్ కమింగ్ మూవీల విషయం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఇండస్ట్రీ టాక్స్.