ప్రభాస్ డైరెక్టర్ ని లాక్కున్న మహేష్ బాబు
ఒకసారి స్టార్ హీరో సినిమా ప్లాప్ అయిందంటే ఆ తరువాత సినిమాకి భారీ ప్రెజర్ తనపై ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడటానికే ఆసక్తి చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తో హీరోలు రెగ్యులర్ టచ్ లో ఉంటారు. అలా స్టార్ హీరో ప్రభాస్ సైతం మిర్చి తరువాత బాహుబలి, బాహుబలి తరువాత మళ్ళీ కొరటాల శివ కాంబినేషన్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బాహబలి తరువాత రెండో సినిమాగా కొరటాల సినిమాని షెడ్యూల్ లో పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ అనుకున్న షెడ్యూల్స్ లో భారీ మార్పులు జరిగాయి. కొరటాల శివ తనతో మూవీని కాదనుకొని మళ్ళీ మహేష్ బాబుతో మూవీని చేయనున్నాడని అంటున్నారు.
అయితే ఇక్కడ మహేష్ బాబు కచ్ఛితంగా కొరటాల శివతో మూవీని కమిట్ కావటంతో ప్రభాస్ మూవీని కొరటాల వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయనున్నారు. దీని తరవాత మళ్ళీ కొరటాలతో మూవీ ఉంటుందని అంటున్నారు.