ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా..?!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరో పొజీషన్లో వెలిగిపోతున్న హీరోల్లో ఈ కుర్రాడు ఒకరు..అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన మోజుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు..అలాంటి హీరో ఇప్పుడు ఓ ఫోటో షేర్ చేశాడు..తన చిన్పప్పుడు అంటే 18 ఏళ్ల క్రితం అక్షయ్, రవీనా టాండన్లు జంటగా నటించిన 'కీమత్' సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా స్పాట్ కి వెళ్లిన ఆ బుడ్డోడు షూటింగ్ లో ఉన్న రవీనా టాండన్ ని చూసి ఆశ్చర్యపోయాడట..నిజంగా హీరోయిన్లు అంటే ఇంత అందంగా ఉంటారా అనుకున్నాడట..అంతే కాదు ఇప్పటికీ ఆమెను మర్చిపోలేనంటున్నాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన హీరో అక్షయ్ కుమార్ తో పరిచయం చేసుకొని ఓ ఫోటో క్లిక్ మనిపించారట.  ఇన్నాళ్ల తర్వాత తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అందరితో తన ఫోటోతో ఆనందాన్ని పంచుకున్నాడు..ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అనుకుంటున్నారా..! ఆ మద్య బాలీవుడ్ లో చారిత్రాత్మ చిత్రం  బాజీరావ్ మస్తానీ హీరో  'రణ్ వీర్ సింగ్'. అక్షయ్ తాజా చిత్రం రుస్తుం విడుదల కావడానికి ఇంకా 9 రోజులు ఉందంటూ ఈ ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు రణ్ వీర్ సింగ్.

రణవీర్ సింగ్ ట్విట్ :

PRICELESS #Throwback !!!
My Fanboy moment with the One & Only @akshaykumar ! 😇🙏#9DaysToRustom
(Watch this space!) pic.twitter.com/qCc55IhT14

— Ranveer Singh (@RanveerOfficial) August 3, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: