ఫోటో ఫీచర్ : కమల్ తో ఇళయరాజా ఏంటో ఆ ముచ్చట్లు..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సంగీత మాంత్రికుడు ఇళయరాజ ఇప్పటి వరకు ఎన్నో వేల చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు ఆయన సంగీతం అందించిన చిత్రాలు ఎన్నో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ ఒక్క నటుడుగానే కాకుండా సంగీతం పై కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి. నటుడిగా, దర్శకుడిగా నే కాకుండా మంచి డ్యాన్స్ మాస్టర్ కూడా..అయితే ఇళయరాజ,కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.

ఆ పాటలు ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా కమల్ చిత్రాలకు సంగీతం చేకూర్చే సమయంలో ఆయనతో చాలా వరకు ముచ్చటించేవారట ఇళయరాజ..ఇలా వీరిద్దరూ సంగీత బాణీ సమకూర్చిన చిత్రాలు ఎప్పటికీ చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వీరిద్దరూ ఏదో సీరియస్ గా ముచ్చటిస్తున్నే ఫోటో మీకోసం.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: