ఆత్మహత్య చేసుకుంటా అంటున్న సినీ నటి..!

Edari Rama Krishna
సినిమా ప్రపంచం అంటే ఓ రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు..ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు జన్మ దన్యమైందని భావిస్తారు. ఇక సినిమా స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేసేవారు రోజూ ఎంతో మందిని చూస్తుంటారు. కొంతమంది హీరోలు, కామెడీ వేషాలు ఇప్పిస్తామని నిలువునా ముంచేసిన ఘటనలు ఉన్నాయి. ఇక హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేషాలు ఇప్పిస్తామని అమ్మాయిలను బుట్టలో వేసుకొని కొంత మంది దళారులు వారి జీవితాలతో ఆడుకుంటారు. వారి బలహీనతలు ఆసరగా తీసుకొని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ చాలా మంది అమ్మాయిలు మోసపోయి బయటకు చెప్పుకోలేక జీవితాన్ని ముగించుకుంటున్నారు.

మరి కొంత మంది జూనియర్ ఆర్టిస్టు లెవెల్ లో ఉన్నవారు అందంగా ఉన్న అమ్మాయిలను బుట్టలో వేసుకొని సినిమా చాన్స్ ఇప్పిస్తానని మోసం చేసి అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటానని తప్పుడు వాగ్ధానాలు చేసి వారి అవసరం తీరిపోయిన తర్వాత బయటకు నెట్టి వేసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాయాగా ముంబాయిలో బాలీవుడ్ నటి అలీసాఖాన్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఇమ్రాన్ హస్మితో చేస్తున్న అలీసా ఖాన్ స్వస్థలం ఘజియాబాద్. ఈమె హిందీ చిత్రాల్లోనే కాక పలు తమిళ సినిమాల్లో సైతం నటించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నడిరోడ్డుపై వదిలి వెళ్లడంతో దిక్కులేనిదయింది.  గత కొన్ని రోజుల నుంచి ఆమెను బెదరించడం కూడా జరుగుతుందని అంటుంది.

అయితే ఇప్పటి వరకు తాను పోరాటం చేస్తున్నానని తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని అంటుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అలీసా ఖాన్ నటుడు లవ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అలీసా కుటుంబ సభ్యులు ఆమెతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఓ వైపు తన కుటుంబ సభ్యులు కాదన్నారు..ఇప్పుడు  భర్త లవ్ కపూర్ తనను వదిలేసి వెళ్లిపోయాడని తనకు న్యాయం చేయాలని హరిద్వార్ పోలీస్ స్టేషన్ లో అలీసా ఫిర్యాదు చేసింది.

అయితే, పోలీసులు కూడా తన ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తోంది.  ఇక తనకు చావే గతి అని అప్పటికైనా పోలీసులు విచారణ చేపడతారా లేదా అని అనడంతో  వెంటనే స్పందించిన హరిద్వార్ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: