ఐసీయూ లో హీరో విజయ్ తండ్రి..అసలు ఏం జరిగింది!

Edari Rama Krishna
తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం రజినీకాంత్ నెంబర్ వన్ హీరోగా ఉన్నారు..అయితే ఆయన తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్, సూర్య లు మాత్రమే. ప్రస్తుతం విజయ్ మాస్ హీరోగా నెంబర్ వన్ పోజీషన్ కోసం తెగ ఆరాట పడుతున్నాడు. గత సంవత్సరం పులి సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయినప్పటికీ అది పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.  ఈ సంవత్సరం పోలీస్ సినిమాతో నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు. అంతే కాదు విజయ్ సామాజిక సేవా స్వభావం కలిగిన వ్యక్తిగా ఎన్నో స్వచ్చంద సంస్థలకు సహాయాలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఆ మద్య చెన్నై వరద బాధితులకు మొదట ఐదు కోట్లు విరాళాన్ని ప్రకటించింది హీరో విజయ్.

ఈయన స్ఫూర్తితో చాలా మంది విరాళాలు ప్రకటించారు. తాజాగా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ (71) కు తీవ్ర గాయాలయ్యాయి దాంతో హుటా హుటీన ఆసుపత్రికి తరలించారు . కుమారకుమ్ లోని ఒక రిసార్ట్ లో కళ్లు తిరిగి పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

తమిళంలో పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు చంద్రశేఖర్ . ఆయన వారసుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన విజయ్ తమిళంలో రజనీ తర్వాత అంతటి స్టార్ డం ని సంపాదించాడు . ప్రస్తుతం చంద్రశేఖర్ ఐసి యు లో ఉన్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: