ఆ ఛాన్స్ దక్కించుకున్న అమలా..

shami
కెరియర్ స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే సౌత్ సూపర్ బ్యూటీగా స్టార్ క్రేజ్ సంపాదించిన అమలా పాల్ అదే కెరియర్ మంచి జోరు మీదున్న సందర్భంలోనే డైరక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్ళాడింది. రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న వారి పెళ్లి ఇప్పుడు డైవర్స్ దాకా వచ్చింది. తన లైఫ్ లో ఇలాంటి టర్నింగ్ ఊహించని అమలా చాలా బాధపడ్డది. 


అయితే ఏ సినిమా కోసమైతే అమలా ఇంత రిస్క్ తీసుకుందో అదే సినిమా అవకాశం కూడా చేజారిందని కోలీవుడ్ మీడియా హడావిడి చేసింది. వెట్రిమారన్ డైరక్షన్లో ధనుష్ హీరోగా వడా చెన్నై సినిమా తెరకెక్కుతుంది. ముందు ఆ సినిమాలో హీరోయిన్ గా అనుకున్న సమంత ఇక్కడ ప్రేమ పులకింతలతో వచ్చిన ఆ సినిమా అవకాశాన్ని కూడా కాదనుకుంది.  


ఇక ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ గా అమలాను అడగడం ఆమె ఓకే చెప్పడంతో భర్త విజయ్ తో ఆమె గొడవలు స్టార్ట్ అవడం అంతా తెలిసిందే. అయితే చివరకు ఇన్ని గొడవలకు కారణమైన ఆ సినిమా ఆఫర్ కూడా అమలా పాల్ మిస్ చేసుకుంది అని నిన్న మొన్నటి వార్త కాని ధనుష్ నిర్మాతగా చేస్తున్న వడా చెన్నైలో అమలా నటించే అవకాశాలున్నాయట. 


సో అమలా హోప్స్ ఇంకా అలానే ఉన్నాయన్నమాట. ఏ సినిమా కోసమైతే ఆమె తన జీవితాన్ని కూడా త్యాగం చేసిందో అదే సినిమాతో ఆమె ఇదవరకు ఉన్న క్రేజ్ ను తెచ్చుకోవాలని ఆశిద్దాం. ఇక ఎలాగు ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది కాబట్టి ఇకనుండి తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టేస్తుందట. అవసరమైతే గ్లామర్ షోకు కూడా వెనుకాడేది లేదు అన్న పరిస్థితి కనబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: