ఆ నలుగురి హీరోలని పక్కన పెట్టిన త్రివిక్రమ్
అయితే ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు త్రివిక్రమ్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పెద్ద హీరోలతోనే చేసిన త్రివిక్రమ్...ఇప్పుడు నితిన్ లాంటి హీరోతోనూ చేయటంతో, ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమాని ఓకె చేయించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారిలో శర్వానంద్, నాని, రామ్, మంచు హీరోలు ఉన్నారు. అయితే వారందరి త్రివిక్రమ్ పక్కన పెట్టారంట.
ఇక పెద్ద హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఉన్నారని తెలుస్తుంది. జేనతా గ్యారేజ్ వంటి మూవీ తరువాత జూనియర్, త్రివిక్రమ్ తో మూవీని చేసేందుకు ఇష్టపడుతున్నాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డిస్కషన్స్ ఇప్పటి వరకూ జరగలేదు. జూనియర్ కేవలం ప్రపోజల్ ని మాత్రమే పెట్టాడు. త్రివిక్రమ్ మాత్రం జూనియర్ తో మూవీకి సిద్ధంగా ఉన్నట్టు లేడు. తను మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
మహేశ్ బాబుతో మైత్రీ మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ సినిమా ఉండనుందని అంటున్నారు. మురుగదాస్ సినిమాతో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో చేసే ఛాన్స్ ఉందని చాలా మంది నుండి వినిపిస్తున్న మాటలు. అందుకే మహేష్ కోసం త్రివిక్రమ్ ఆ హీరోలను పక్కన పెట్టాడని అంటున్నారు.