పోర్న్ స్టార్ సన్నీలియోన్ నటించిన జిస్మ్-2 ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో అందరీ దృష్టి సన్నీ లియోన్ పై ఉంది. మీడియా కూడా సన్నీ లియోన్ పై ప్రత్యేక ఫోకస్ పెడుతుంది.
అయితే ఇదంతా బాలీవుడ్ లో కొందరు ముద్దుగుమ్మలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసాకు నచ్చడం లేదు. దీనికి తోడు జిస్మ్ లో ఈ భామ నటించింది. ఇప్పుడు జిస్మ్-2లో ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా, పైగా ఇంక ఎవరూ దొరకనటు పోర్న్ స్టార్ కు ఛాన్స్ ఇవ్వడంతో బిపాసకు ఎక్కడో కాలుతుంది. అందుకు తగ్గట్లే జిస్మ్-2 గురించి వ్యాఖ్యలు చేస్తుంది. తాను నటించిన జిస్మ్ మంచి సినిమా అని, జిస్మ్-2 వల్గారిటీతో కూడిన సినిమా అని చెపుతుంది.
అయితే బిపాసాను అటు బాలీవుడ్ వర్గాలు కానీ, ఇటు బాలీవుడ్ మీడియా పట్టించుకోవడం లేదు. బిప్స్ కు పెద్దగా ఛాన్సులు లేకపోవడం, జాన్ అబ్రహం వదలి వేయడం వంటి కారణాలతో ఆమె ఇలా మాట్లాడుతుందని లైట్ గా తీసుకుంటున్నారు.
దీంతో బిపాసాకు ఇంకా మంటెక్కుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: