హన్సిక కు కష్టమర్లు కావాలట!
పాపం.. హన్సిక చివరికి సేల్స్గాళ్గా మారింది. అవి కోనండి.. ఇవి కొనండి అంటూ డబ్బాలు పట్టుకొని షాపింగ్ మల్లో అటూ ఇటూ తిరుగుతూ, కష్టమర్లను కాకా పడుతూ.. నానా కష్టాలు పడుతోంది. అయ్యో పాపం... ఇదేం ఖర్మ?? అనుకోకండి. ఇదంతా సినిమాకోసమే. శింభు-హన్సిక జంటగా ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఇందులో హన్సికది సేల్స్గాళ్ పాత్ర.
ఈపాత్రలో జీవిస్తూ... అందరినీ తెగ ఆకట్టుకొంటోంది హన్సిక. ``నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఏదో ఓ మాల్లో దూరిపోతా. అక్కడ సేల్స్గాళ్స్ ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. వాటినే నేను ఫాలో అవుతున్నా. అందుకే ఈ పాత్రలో నటించడం పెద్ద కష్టం అనిపించడం లేదు`` అని చెప్తోంది. తెలుగులో సమ్థింగ్ సమ్థింగ్ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ కథానాయకుడు. ఈనెలలోనే ఈ సినిమా విడుదల కానుంది.